ICC WORLD CUP 2019 | విరహ వేదన తాళలేక...విరాట్ కోసం లండన్‌‌లో వాలిన అనుష్క శర్మ...

వరల్డ్ కప్ ప్రారంభమైన తొలి 20 రోజుల పాటు టీమిండియా సభ్యులు, తమ భార్య, ఇతర కుటుంబ సభ్యులను పర్యటనకు తీసుకొని రావద్దని, వారితో కలవద్దని బీసీసీఐ కఠినమైన ఆర్డర్ పాస్ చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐ ఈ చర్య తీసుకుంది.

news18-telugu
Updated: June 19, 2019, 4:21 PM IST
ICC WORLD CUP 2019 | విరహ వేదన తాళలేక...విరాట్ కోసం లండన్‌‌లో వాలిన అనుష్క శర్మ...
కోహ్లీ, అనుష్క
news18-telugu
Updated: June 19, 2019, 4:21 PM IST
బాలివుడ్ భామ అనుష్క శర్మ తన భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని కలిసేందుకు లండన్ చేరుకుంది. శనివారం ఆఫ్గనిస్థాన్ తో భారత్ వేల్స్ మైదానంలో తలపడనుంది. దీంతో టీమిండియాకు మరో రెండు రోజుల పాటు ఖాళీ సమయం దక్కింది. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ లో తలమునకలవుతున్న తన భర్త విరాట్ కోహ్లీని కలిసేందుకు అనుష్క లండన్ లో వాలిపోయింది. ఇద్దరు కలిసి లండన్ లోని ఓల్డ్ బాండ్ స్ట్రీట్ లో డిన్నర్ చేస్తుండగా అభిమానులు గుర్తించి క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అనుష్క కొత్త హెయిర్ కట్ తో వెరైటీగా కనిపించింది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ప్రారంభమైన తొలి 20 రోజుల పాటు టీమిండియా సభ్యులు, తమ భార్య, ఇతర కుటుంబ సభ్యులను పర్యటనకు తీసుకొని రావద్దని, వారితో కలవద్దని బీసీసీఐ కఠినమైన ఆర్డర్ పాస్ చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐ ఈ చర్య తీసుకుంది. అయితే అటు పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించడంతో పాటు వరల్డ్ కప్ పర్యటనలో 20 రోజులు గడిచిపోయాయి. అలాగే టీమిండియా ఆడే ఆఫ్గనిస్థాన్ మ్యాచ్ కోసం గ్యాప్ రావడంతో క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో గడపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అటు కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన భార్యా రితికతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించాడు.

అలాగే శిఖర్ ధావన్ సైతం గాయం కారణంగా టీమిండియాకు దూరమైన నేపథ్యంలో భార్యతో లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. మరోవైపు ధోనీ సైతం తన కూతురు, భార్యతో కలిసి లండన్‌లో చక్కర్లు కొడుతున్నాడు. అలా పెళ్లైన సీనియర్లు భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే, బ్యాచిలర్ బాబులు మాత్రం ఒంటరిగా నెట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...