• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ANUSHKA SHARMA FIRES A PUBLICATION FOR SNAPING HER PHOTOS ENJOYING BREAKFAST WITH HUSBAND VIRAT KOHLI SRD

Anushka Sharma : మేము మనుషులమే.. మాకు ప్రైవసీ ఉంటుంది..! అనుష్క శర్మ ఫైర్

Anushka Sharma : మేము మనుషులమే.. మాకు ప్రైవసీ ఉంటుంది..! అనుష్క శర్మ ఫైర్

Kohli-Anushka (Photo credit : Instagram)

Anushka Sharma : సెలబ్రిటీలుగా ఉండటం అంత ఈజీ కాదు. సాధారణ జీవితం గడపడం వారికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. సైలెంట్ గా లైఫ్ లీడ్ చేస్తున్న.. సెలబ్రిటీల జీవితం మీద ఆసక్తి ఎక్కువ చూపడం సర్వ సాధారణంగా మారిపోయింది. సెలబ్రీటీలు ఏది చేసినా..

  • Share this:
    సెలబ్రిటీలుగా ఉండటం అంత ఈజీ కాదు. సాధారణ జీవితం గడపడం వారికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. సైలెంట్ గా లైఫ్ లీడ్ చేస్తున్న.. సెలబ్రిటీల జీవితం మీద ఆసక్తి ఎక్కువ చూపడం సర్వ సాధారణంగా మారిపోయింది. సెలబ్రీటీలు ఏది చేసినా.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి గుర్తింపు పొందాలని కొందరు భావిస్తున్నారు. ఆ సెలబ్రిటీలకు కూడా ప్రైవసీ ఉంటుదన్న విషయాన్ని మర్చిపోతారు. ఇలాంటి అనుభవమే కోహ్లీ-అనుష్క శర్మల జంటకు ఎదురైంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ముంబై జూహు నివాసంలోని బాల్కనిలో కోహ్లీ, అనుష్క దంపతులు కూర్చొని ప్రశాంతగా అల్పహారం తీసుకుంటున్నారు. ఈ పోస్ట్ ని అనుష్క శర్మ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ విషయంలోనే అనుష్క శర్మ సీరియస్ గా ఉంది. ఎందుకంటే.. అనుష్క పోస్ట్ చేసిన ఫోటోను విరుష్క దంపతుల అనుమతి లేకుండా తీసి ఓ ఫోటోగ్రాఫర్ తమ పబ్లికేషన్స్ లో ఉపయోగించుకున్నారు.



    ఆ ఫోటో గ్రాఫర్, పబ్లికేషన్స్ పై అనుష్క శర్మ సీరియస్ అయింది. మేము మనుషులమే.. మాకు ప్రైవసీ ఉంటుందని.. ఎటువంటి అనుమతులు లేకుండా ఫోటోలు తీయడం సమంజసం కాదని అనుష్క శర్మ ఫైర్ అయింది. ఇలాంటి పనులు తక్షణమే మానివేయాలని ఆమె సూచించింది. ఈ నెలలోనే అనుష్క తన బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇందుకోసం పితృత్వపు సెలవుల మీద విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు తిరిగొచ్చాడు.

    లేటెస్ట్ గా వోగ్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్క శర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కరోనా పాండమిక్ అనేది అనుకోని వరంగా ఆమె భావించింది. లాక్ డౌన్ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉన్న తనను కోహ్లీ ఎంచక్కా ఆస్పత్రికి తీసుకెళ్లాడని.. అటువంటి సమయంలో ఇతరుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని అనుష్క శర్మ వెల్లడించింది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు