ANUSHKA SHARMA ALL SET TO MAKE A POWERFUL COMEBACK IN FILMS AS JHULAN GOSWAMI IN CHAKDA XPRESS WATCH FULL DETAILS HERE GH VB
Anushka Sharma: ఎట్టకేలకు బిగ్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇవ్వనున్న అనుష్క శర్మ.. కానీ ఈ సారి ఓ స్పెషల్ ఉందండోయ్..
Virushka
పెళ్లి తరువాత వెండితెరకు దూరమైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పవర్ఫుల్ పాత్రతో రీఎంట్రీ ఇవ్వనుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లి(Marriage) తరువాత వెండితెరకు దూరమైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్(Bolly Wood Star) అనుష్క శర్మ(Anushka Sharma) పవర్ఫుల్ పాత్రతో రీఎంట్రీ(Re Entry) ఇవ్వనుంది. ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌లో ఆమె నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్(Twitter) వేదికగా ప్రకటించింది. తన భర్త, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) క్రికెటర్ కాగా.. ప్రస్తుతం తానూ ఓ క్రికెటర్ పాత్రలో అలరించేందుకు సిద్ధమైంది. మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్న ఈ సినిమాపై ఆమె అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత మహిళా క్రికెట్ జట్టు(Indian Womens Cricket Team) మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ జులన్ గోస్వామి(Jhulan Goswamy) వంటి శక్తిమంతమైన పాత్రతో సినిమాల్లోకి పునరాగమనం చేయనున్న అనుష్క సినిమాకు.. చక్దా ఎక్స్‌ప్రెస్ (Chakdaha express) అనే పేరును ఖరారు చేశారు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో విరుష్క ఫ్యాన్స్(virushka fans) ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ మేరకు తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమా ఎంతో ప్రత్యేకమైనదంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది అనుష్క శర్మ. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన జీరో సినిమాలో(zero movie) 3 సంవత్సరాల క్రితం చివరిగా నటించిందామె. ‘భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా నుంచి ఎంతో ప్రేరణ పొందాను. అమితమైన త్యాగంతో కూడిన చక్దా ఎక్స్‌ప్రెస్ మూవీ నాకు చాలా ప్రత్యేకమైనది. మహిళల క్రికెట్ గురించి ఈ సినిమా ప్రపంచానికి తెలియజేస్తుంది. మహిళలు క్రీడలు ఆడొచ్చా అనే ఆలోచనలో ఉన్న రోజుల్లో క్రికెటర్‌గా అవ్వాలని.. ప్రపంచ వేదికపై దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్న జులన్ ఆశయం చాలా గొప్పది’.. అంటూ అనుష్క ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది.
ఆమె జీవితాన్ని మాత్రమే కాకుండా.. మహిళా క్రికెట్ గురించి ఈ సినిమా ప్రపంచానికి తెలుపుతుంది. మహిళా క్రికెటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఆటల ద్వారా స్థిర ఆదాయం పొందడ, క్రికెట్లో భవిష్యత్తు లేదనే భావనలు వంటివాటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. అంతేగాక.. భారత్‌లో మహిళలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంపై ఉన్న అనేక అనుమానాలను జులన్ గోస్వామి పటాపంచలు చేశారని అనుష్క అభిప్రాయపడ్డారు.
అనుష్క శర్మ చేతిలో మరో 3 భారీ ప్రాజెక్ట్‌లు
అనుష్క శర్మ తిరిగి సినిమాల్లోకి వస్తుందని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నెలలోనే మూడు బడా ప్రాజెక్ట్‌లపై సంతకం చేసినట్లు స్పష్టం చేసింది అనుష్క. వాటిలో ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించి ట్రైలర్లు విడుదల కాగా.. ఇప్పుడు చక్దా ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. సుల్తాన్, పీకే, సంజు వంటి యాక్టింగ్ ప్రయారిటీ సినిమాల్లో హీరోయిన్గా నటించిన అనుష్క శర్మ.. తనదైన నటనతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.