విరాట్ కోహ్లీ పేరు మార్చిన అనుష్క.. ఎందుకో తెలుసా?

లవర్స్ అన్నాక పేర్లు మార్చుకుని ఒకరినొకరు ముద్దుగా పిలుచుకోవడం సర్వసాధారణమే. అలాగని విరాట్ కోహ్లి పేరు కూడా అనుష్క అందుకే మార్చిందనుకుంటే పొరపాటే. దానికి వేరే కారణముంది. అసలింతకూ ఆమె విరాట్‌ పేరును ఎందుకు మార్చింది? ఎప్పుడు మార్చింది?

news18-telugu
Updated: March 5, 2019, 1:54 PM IST
విరాట్ కోహ్లీ పేరు మార్చిన అనుష్క.. ఎందుకో తెలుసా?
విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ ( Anushka Sharma/ Twitter )
news18-telugu
Updated: March 5, 2019, 1:54 PM IST
బాలీవుడ్ బామ అనుష్క, టీమిండియా సారథి విరాట్ కోహ్లిల ప్రేమ గురించి తెలియని క్రికెట్ లవర్సూ, సినిమా లవర్సూ ఉండరు. 2017 డిసెంబర్‌లో ఈ జంట పెళ్లిపీటలెక్కింది. సెలబ్రిటీలే అయినా, పెళ్లిని మాత్రం చాలా సింపుల్‌గా కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యే జరుపుకొన్నారు. ఆ సందర్భంలోనే తన ప్రియుడు విరాట్ పేరును మార్చేసిందట అనుష్క. తామెంతో సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నందున.. తమ మేనేజర్లకు, కుటుంబీకులకు, స్టైలిస్టులకు తప్ప మరెవ్వరికీ అసలు పేర్లు తెలియకూడదని భావించిందట. అందుకే భోజనాల సమయంలో కేటరర్స్‌కు తమ పేర్లను మార్చి చెప్పిందట. ఇంతకీ విరాట్ పేరు ఏమని మార్చిందో తెలుసా. రాహుల్ అని మార్చిందట. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి అనుభవాలను పంచుకుంది అనుష్క. ‘‘ మా పెళ్లికి సంబంధించిన సమాచారం ఫ్యామిలీకి, మేనేజర్లకు, స్టైలిస్టులకు తప్ప మరెవ్వరికీ తెలియనీయొద్దనుకున్నాం. అందుకే భోజనాల సమయంలో కేటరర్స్‌కు మా పేర్లు మార్చి చెప్పమన్నాం. విరాట్ పేరు బయటికి రాకుండా రాహుల్ అని మార్చాను. మేం ఇద్దరం సెలబ్రిటీలం పెళ్లి చేసుకుంటున్నామనే ఫీలింగ్ రాకూడదనే ఇలా ముందుగానే  ప్లాన్ చేసుకున్నాం. మా పెళ్లిలో కేవలం 42 మంది అతిథులే పాల్గొన్నారు’’ అని చెప్పింది అనుష్క.

ప్రస్తుతం ఈ జంట ఎవరి పనుల్లో వారు బిజీ షెడ్యూల్‌ని గడుపుతున్నారు. విరాట్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో బిజీగా ఉండగా, అనుష్క ఇటీవలె జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆమె, తన తర్వాతి ప్రాజెక్ట్ ఏమిటనేది ఇంకా ప్రకటించలేదు.

First published: March 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...