Bat Balance : బ్యాట్ బ్యాలెన్స్.. ఈ విషయంలో విరాట్ కంటే అనుష్కనే బెస్ట్.. కావాలంటే ఈ వీడియో చూడండి

అనుష్క, విరాట్ జంట కొత్త చాలెంజ్ చూశారా? మీరూ ఇలా చేయండి

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విరుష్క జంట బ్యాట్ బ్యాలెన్స్‌లో పాల్గొన్నారు. తమ అభిమానులు కూడా ఇలా బ్యాట్ బ్యాలెన్స్ చేసి ఆ వీడియోలు టకాటక్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు.

  • Share this:
    టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ((Virat Kohli), అతడి భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత 20 రోజుల పాటు టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ సెలవులు ప్రకటించింది. దీంతో క్రికెటర్లు అందరూ లండన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో విహార యాత్రకు వెళ్లిపోయారు. అనుష్క, కోహ్లీ జంట తమ కూతురు వామికాతో కలసి షికార్లు కొడుతున్నారు. అయితే ఏయే ప్రాంతాలు తిరుగుతున్నామని మాత్రం చెప్పలేదు. మరోవైపు పనిలో పనిగా తమ అభిమానునలకు #BatBalance (బ్యాట్ బ్యాలెన్స్) ఛాలెంజ్ విసిరారు. బ్యాటును వేలిపై ఎవరు ఎక్కువ సేపు నిలబెడతారనేది ఈ ఛాలెంజ్. అనుష్క, విరాట్ కూడా విడివిడిగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ తన ఎంఆర్ఎఫ్ బ్రాండింగ్ బ్యాటును బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఇక అనుష్క శర్మ కూడా ఒక బ్యాట్‌ను వేళ్లపై నిలబెట్టింది. కాగా, కోహ్లీ తన బ్యాట్ బ్యాలెన్స్ చేయడానికి నానా తంటాలు పడగా.. అనుష్క మాత్రం చాలా సింపుల్‌గా బ్యాలెన్స్ చేసేసింది.

    వీరిద్దరి వీడియోలను కలిపి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కాగా, ఈ బ్యాట్‌బ్యాలెన్స్ అనేది సోషల్ మీడియా వీడియో యాప్ టకాటక్ కోసం రూపొందించింది. సెలెబ్రిటీలు ప్రొడక్ట్స్ ప్రచారం చేయడానికి ఇలాంటి ఛాలెంజెస్ విసురుతుంటారు. అభిమానులు కూడా ఈ బ్యాట్ బ్యాలెన్స్ ఛాలెంజ్‌లో పాల్గొని తమ వీడియోలు టకాటక్ యాప్‌లో పోస్టు చేయాలని కోరారు. ఇందుకు #BatBalance అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేయాల్సి ఉంటుంది. అయితే ఎంఎక్స్ ప్లేయర్ వాళ్ల టకాటక్ యాప్‌ను ఇన్‌స్టాలో ప్రమోట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.






    ఇక టీమ్ ఇండియా అగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనున్నది. జులై 15న విహార యాత్రలో ఉన్న క్రికెటర్లు అందరూ దుర్హమ్ కౌంటీకి చేరుకుంటారు. అక్కడ రివర్ సైడ్ స్టేడియంలో రెండు టూర్ మ్యాచ్‌లు ఆడనున్నారు. తొలుత ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లే ఆడాలని ఈసీబీ చెప్పింది. అయితే బీసీసీఐ ఒప్పించడంతో రెండు కౌంటీ జట్లతో టూర్ మ్యాచ్‌లకు ఓకే చెప్పింది. ఒక నాలుగు రోజుల మ్యాచ్, మరొక మూడు రోజుల మ్యాచ్‌లను టీమ్ ఇండియా ఆడనున్నది. ఈ రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అగస్టు 1న ట్రెంట్ బ్రిడ్జికి పయనమవుతారు. అక్కడ అగస్టు 4 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్నది. సెప్టెంబర్ 14తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత యూఏఈ వెళ్లి ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు ఆడతారు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటారు. రాబోయే రెండు మూడు నెలల పాటు టీమ్ ఇండియా చాలా బిజీగా గడపనున్నది.
    Published by:John Naveen Kora
    First published: