Tokyo Olympics: భారత్‌కు మరో పతకం ఖాయం.. బాక్సింగ్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లవ్లీనా

ఒలింపిక్స్‌లో మరో పతకం ఖాయం.. సెమీస్ చేరిన బాక్సర్ లవ్లీనా (SAI Media)

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖరారైంది. బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్యం సాధించే అర్హత పొందింది.

  • Share this:
    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత్‌కు (India) మరో పతకం (Another Medal) ఖరారైంది. మహిళల బాక్సింగ్ వాల్టర్ వెయిట్ (64 కేజీల నుంచి 69 కేజీల) విబాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ (Lovlina Borgohain) సెమీఫైనల్ చేరుకున్నది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా చైనీస్ తైపీకి చెందిన చెన్ నీచిన్‌పై గెలుపొందింది. జడ్జీలు 4-1తో లవ్లీనా వైపు మొగ్గు చూపారు. ఒలింపిక్స్‌లో పతకం తెస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్న స్టార్ బాక్సర్ మేరీకోమ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడిపోయింది. దీంతో భారతీయుల ఆశలు అడియాశలయ్యాయి. 24 గంటలు తిరగక ముందే నేనున్నానంటూ 23 ఏళ్ల అస్సామ్ అమ్మాయి నిరూపించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో లవ్లీనా బోర్గెహెన్ చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్‌పై 4-1 తేడాతో విజయం సాధించి పతకం ఖాయం చేసుకున్నది. ఒక వేళ సెమీస్‌లో గెలిస్తే కాంస్యానికి మించిన పతకమే దక్కుతుంది. లవ్లీనా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలి సారి కావడం గమనార్హం.

    ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందిస్తున్న మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్ర సష్టించనున్నది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత బాక్సర్ లవ్లీనా మాత్రమే. ఇక ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో పతకం తేనున్న మొదటి బాక్సర్‌గా రికార్డు సృష్టించనున్నది. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్యం అందించిన లవ్లీనా.. ఇప్పుడు దేశానికి ఒలింపిక్ పతకం అందించనున్నది. అగస్టు 4న లవ్లీనా టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనిల్‌తో తలపడనున్నది.






    లవ్లీనా రెండో పతకం తేవడం ఖాయం అవడంతో ఆమెను పలువరు ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు అభినందించారు.
    Published by:John Naveen Kora
    First published: