• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ANOTHER CRICKET BOARD OFFERD TO HOST IPL WHAT IS THE REASON BEHIND THAT OFFER JNK

IPL 2021 : ఐపీఎల్ మా దేశంలో నిర్వహించండి.. బీసీసీఐకి మరో క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్

IPL 2021 : ఐపీఎల్ మా దేశంలో నిర్వహించండి.. బీసీసీఐకి మరో క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్

ఐపీఎల్ మా దగ్గర నిర్వహించండి.. అన్ని ఏర్పాట్లు చేస్తాం

ఐపీఎల్ 2021ని పూర్తి చేయాలని బీసీసీఐ ధృఢ నిశ్చయంతో ఉన్నది. దీని కోసం ఇప్పటికే మూడు దేశాలు ఆఫర్ ఇచ్చాయి. తాజాగా మరో క్రికెట్ బోర్డు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తామని బీసీసీఐకి బంపర్ ఆఫర్ ఇచ్చింది.

  • Share this:
    కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లో (IPL 2021) మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ (BCCI) భావిస్తున్నది. ఇండియాలో కాకుండా ఇతర వేదికల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నది. ప్రస్తుతం సెప్టెంబర్ విండోలో ఐపీఎల్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండవని బీసీసీఐ అంచనాకు వచ్చింది. ఇప్పటికే మూడు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డుల నుంచి ఐపీఎల్ నిర్వహణకు ఆఫర్లు వచ్చాయి. గత ఏడాది నిర్వహించిన యూఏఈతో పాటు ఇంగ్లాండ్ కౌంటీలు, ఆస్ట్రేలియాను ప్రత్యామ్నాయ వేదికలుగా పరిశీలిస్తున్నారు. కాగా, మేము కూడా ఐపీఎల్ నిర్వహిస్తామంటూ శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) ముందుకు వచ్చింది. ఎస్ఎల్‌సీ సలహాదారు అర్జున డి సిల్వ ఈ మేరకు బీసీసీఐకి ఆఫర్ ఇచ్చారు. శ్రీలంక క్రికెట్ ఐపీఎల్ నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. బీసీసీఐకి నచ్చితే తప్పకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. సెప్టెంబర్ విండోలో ఐపీఎల్ ఏర్పాటుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. తగినన్ని మౌళిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు అర్జున డి సిల్వా పేర్కొన్నారు.

    ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిన మ్యాచ్‌లను బీసీసీఐ యూఏఈకి తరలించాలని చూస్తున్నట్లు మాకు తెలిపింది. అయితే శ్రీలంకను కూడా ఒక ఆప్షన్‌గా బీసీసీఐ పరిగణించ వచ్చు అని డిసిల్వ అన్నారు. జులై-అగస్టు నెలల్లో మేము లంకా ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సెప్టెంబర్‌లో ఐపీఎల్ కోసం ఏర్పాట్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మా వద్ద మైదానాలు, ఇతర మౌళిక సదుపాయాలన్నీ అందుబాటులోనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

    Cricket : టీ20 క్రికెట్ ఆడిన తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి కెరీర్ ఎలా ముగిసిపోయిందంటే...


    కాగా, శ్రీలంక క్రికెట్ ఈ ఆఫర్ ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉన్నది. గత ఏడాది కరోనా కారణంగా బీసీసీఐ ఐపీఎల్‌ను యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా లీగ్‌ను విజయవంతం చేశారు. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చింనందుకు, స్టేడియంలో మ్యాచ్ ఫీజులను కలిపి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి బీసీసీఐ రూ. 100 కోట్లు చెల్లించింది. ఈసీబీకి ఇంత భారీ మొత్తంలో ఒకేసారి డబ్బు అందడం చాలా అరుదైన విషయమే. పాకిస్తాన్ జట్టు తమ న్యూట్రల్ వేదికగా యూఏఈని ఎంచుకున్నది. వాళ్లు చెల్లించేది కూడా ఇంతకంటే తక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక క్రికెట్ ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నది. కరోనా కారణంగా పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు రద్దవడంతో ఆదాయం భారీగా పడిపోయింది. కనీసం ఐపీఎల్ నిర్వహిస్తే కాస్తైనా ఆదాయాన్ని అర్జించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే బీసీసీఐకి ఆఫర్ ఇచ్చింది. మరి క్రికెట్ పెద్దన్న బీసీసీఐ ఏం చేస్తుందో వేచి చూడాలి.
    Published by:John Naveen Kora
    First published: