అనిల్ కుంబ్లే చేసిన పనికి నెటిజన్స్ ‘ఫిదా’... ఎంత ఎదిగినా!

సాటి ప్రయాణికురాలి ట్వీట్‌కు స్పందించిన లెజెండరీ బౌలర్... ‘బోర్డింగ్ పాస్‌ను ఫ్రేమ్ కట్టించుకుంటా...’ అన్న అభిమాని!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 10, 2018, 7:38 PM IST
అనిల్ కుంబ్లే చేసిన పనికి నెటిజన్స్ ‘ఫిదా’... ఎంత ఎదిగినా!
అనిల్ కుంబ్లే (అభిమాని పోస్ట్ చేసిన ఆటోగ్రాఫ్ ఫోటో)
  • Share this:
అనిల్ కుంబ్లే... ఈపేరు వినగానే దవడకు గాయం తగిలినా, కట్టు కట్టుకుని బౌలింగ్ వేసి టీమిండియాను గెలిపించిన క్రికెటరే గుర్తుకువస్తాడు క్రికెట్ అభిమానులకు! టీమ్‌లో మెయిన్ స్పిన్నర్‌గానే కాకుండా కెప్టెన్‌గా, కోచ్‌గా కూడా తన సేవలు అందించాడు అనిల్ కుంబ్లే. ఎటువంటి హడావుడీ లేకుండా... ఎంతో హుందాగా వ్యవహారించే కుంబ్లేకి లక్షల్లో అభిమానులున్నారు. తాజాగా ఆయన హుందాతనంతో నెటిజనుల మనసు దోచుకున్నాడు అనిల్ కుంబ్లే. ఇంతకీ విషయం ఏమిటంటే...

సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉండే అనిల్ కుంబ్లే... బెంగళూరు నుంచి ముంబై వెళ్లేందుకు విమానం ఎక్కాడు. అదే ప్లెయిన్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళా అభిమాని... ఆయన్ని చూసి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో పోస్ట్ చేసింది... ‘లెజెండరీ అనిల్ కుంబ్లే నేను ఎక్కిన విమానంలో ఉన్నారు. ఆయన్ని చూడగానే వెస్టిండీస్ మ్యాచ్‌లో తలకు బ్యాండేజ్ కట్టుకుని బౌలింగ్ చేసి జట్టును గెలిపించిన క్షణాలే గుర్తుకు వచ్చాయి. ఒక్క క్షణం కళ్లల్లో నీళ్లు తిరిగాయి. క్రికెట్ జ్ఞాపకాల్లో ఇరుక్కుపోయాను...’ అంటూ పోస్ట్ చేసి, కుంబ్లేకి ట్యాగ్ చేసింది సోహిని అనే మహిళ.
ఆ తర్వాత కొద్దిసేపటికే ‘నేను వెళ్లి ఆయన్ని కలిసి... భారత జట్టుకు ఎన్నో విజయాలు,మధురానుభూతులు అందించినందుకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది... కాని నా కాళ్లు భయంతో వణుకుతున్నాయి...’ అంటూ మరో ట్వీట్ చేసింది.

వరుస ట్వీట్లతో వెంటనే స్పందించిన కుంబ్లే... ‘ప్లీజ్... భయపడకండి. టేకాఫ్ అయ్యాక ఫ్రీగా వచ్చి హాయ్ చెప్పండి....’ అంటూ రిప్లై ఇచ్చాడు.
అనిల్ కుంబ్లే నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి...ఆనందంతో ఆశ్చర్యంతో కూడిన భావోద్వేగానికి గురైన ఆ అభిమాని... ‘ఈ బోర్డింగ్ పాస్‌ను నేను ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా... థ్యాంక్యూ అనిల్ కుంబ్లేగారు. మీ నుంచి ఈరోజు వినయం నేర్చుకున్నాను...’ అంటూ ట్వీట్ చేసిందామె.
లెజెండరీ బౌలర్‌గా, భారతదేశం తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న అనిల్ కుంబ్లే... ఓ సాధారణ అభిమాని పట్ల ఇంత సింప్లిసిటీగా నడుచుకోవడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. కుంబ్లే వినయానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. టీమిండియాకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీతో మనస్పర్థల కారణంగా ఆ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

First published: October 10, 2018, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading