ANGERED FANS SLAM BROADCASTER FOR REVEALING VIRUSHKA S DAUGHTER VAMIKA S FACE GH VB
Vamika: వామిక వీడియో బయటకు రావడంపై ఫ్యాన్స్ ఆగ్రహం.. దానిని లక్ష్యంగా చేసుకుంటున్న అభిమానులు..
విరాట్ కోహ్లీ (ఫైల్)
భారత్-దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ సిరీస్‌ను ప్రొటీస్ టీమ్ దక్కించుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీమిండియా దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఒక ఊహించని సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
భారత్-దక్షిణాఫ్రికా(India-South Africa) వన్డే క్రికెట్ సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీమిండియా దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఒక ఊహించని సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్నేళ్లుగా బయటి ప్రపంచానికి తెలియని విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్క శర్మ(Anushka Sharma)ల కూతురు వామిక(Vamika) ముఖం తాజాగా ప్రపంచానికి తెలిసింది. వామిక వీడియోను మ్యాచ్ సందర్భంగా ప్రసారం చేశారు. విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. స్టాండ్స్ క్యాబిన్లో ఉన్న అనుష్క సంతోషంతో చప్పట్లు కొడుతూ, తన కూతురు వామికకు కోహ్లీని చూపించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో కెమెరామెన్ వీరిపై ఫోకస్ పెట్టాడు. దీంతో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ముద్దుల కూతురు వామిక ముఖం మొట్టమొదటిసారి ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో(Social Media) సీరియస్ అవుతున్నారు విరుష్క ఫ్యాన్స్.
ఆదివారం మ్యాచ్ తర్వాత వామిక ఫోటోలు, వీడియోలు మొదటిసారిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విరాట్, అనుష్కలు తమకు కూతురు పుట్టినప్పటి నుంచి వారి ఫ్యామిలీ అప్డేట్స్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. అయితే వామిక ముఖం కనిపించే ఫోటోలు, వీడియోలను వీరిద్దరూ ఎప్పుడూ షేర్ చేయలేదు. ఈ స్టార్ కపుల్ తమ కూతురు ప్రైవసీకి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. అయితే తాజాగా తన వీడియో బయటకు రావడంతో, వీరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వామిక ప్రైవసీని కోహ్లీ దంపతులు కోరుకుంటున్నారని, చిన్నారి ఫోటోలను క్లిక్ చేయవద్దని బ్రాడ్కాస్టర్లను కోరుతున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు
స్టేడియంలోని వీఐపీ లాంజ్ నుంచి అనుష్క మ్యాచ్ చూసింది. వామికను ఎత్తుకొని విరాట్‌ను ఎంకరేజ్ చేస్తున్న వీడియోను బ్రాడ్‌కాస్టర్ ప్రసారం చేశారు. దీంతో ఈ స్టార్ కపుల్ కూతురిని చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెటిజన్లు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వామిక అచ్చం తన తండ్రి మాదిరిగానే కనిపిస్తోందని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. జూనియర్ కోహ్లీ.. తండ్రికి కార్బన్ కాపీ.. ఓ మై గాడ్, సో క్యూటీ.. ఈ రోజు మ్యాచ్‌లో బెస్ట్ పార్ట్.. ఇలాంటి కామెంట్లు, ట్యాగ్‌లతో వామిక ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. చిన్నారి ఫేస్ రివీల్ అయినప్పటి నుంచి చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తూ సందడి చేశారు.
అయితే ఈ స్టార్ కపుల్ డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. మ్యాచ్ బ్రాడ్కాస్టర్లపై చాలామంది నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. వామిక ఫేస్‌ను రివీల్ చేయడం వీరికి నచ్చట్లేదు. విరుష్క జంట అభిప్రాయానికి విరుద్ధంగా వామిక వీడియోను ప్రసారం చేసిన పోస్ట్‌లను డిలీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ విషయంపై ఫ్యాన్ పేజీలు ఇతర సోషల్ మీడియా అకౌంట్లను డిమాండ్ చేస్తున్నాయి.
‘వారు ప్రైవసీ కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ వారి నిర్ణయాన్ని గౌరవించకుండా ఇలా చేయడం మంచిది కాదు!’ ఒక అభిమాని కామెంట్ రాశాడు. ‘ప్లీజ్ వారి ప్రైవసీని గౌరవించండి. దీన్ని డిలీట్ చేయండి’ అని మరొకరు.. ‘ప్లీజ్, ఆమె ఫేస్‌ను హైడ్ చేసి వీడియో షేర్ చేయండి’ అంటూ ఇంకొకరు వామిక ట్రెండింగ్ వీడియోకు ట్విట్టర్లో కామెంట్లు రాస్తున్నారు.
తమ కూతురు ప్రైవసీని విరాట్, అనుష్క ముందు నుంచి కోరుతున్నారు. మీడియా, సోషల్ మీడియాకు దూరంగా స్వేచ్ఛగా తను జీవించే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియా అంటే ఏంటో తనకు అర్థం కాకముందే వామికను సోషల్ మీడియాకు ఎక్స్పోజ్ చేయకూడదని నిర్ణయించినట్లు వీరు తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.