ఇబ్బందిగా ఉంది..ఇక ఆడలేను-టెన్నిస్ గ్రేట్ యాండీ ముర్రే

ప్రస్తుత తరంలోనే అత్యుత్తమ టెన్నిస్ స్టార్స్‌లో యాండీ ముర్రే ఒకడు. టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్, రఫాల్ నడాల్, నొవాక్ జొకోవిచ్ తర్వాతి స్థానం యాండీ ముర్రేదే.

news18-telugu
Updated: January 14, 2019, 7:57 PM IST
ఇబ్బందిగా ఉంది..ఇక ఆడలేను-టెన్నిస్ గ్రేట్ యాండీ ముర్రే
బ్రిటన్ టెన్నిస్ స్టార్ యాండీ ముర్రే ( ATP Tour/ Twitter )
news18-telugu
Updated: January 14, 2019, 7:57 PM IST
బ్రిటన్ టెన్నిస్ హీరో...యాండీ ముర్రే అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ముర్రే రిటైర్మెంట్ కామెంట్స్‌ ప్రస్తుతం టెన్నిస్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టెన్నిస్ గ్రేట్స్ రోజర్ ఫెదరర్, రఫాల్ నడాల్, నొవాక్ జొకోవిచ్ తర్వాతి స్థానం యాండీ ముర్రేదే. ప్రస్తుత తరంలోనే అత్యుత్తమ టెన్నిస్ స్టార్స్‌లో ముర్రే ఒకడు. అంతే కాదు ఆల్ టైమ్ గ్రేట్ బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్‌గా వెలుగొందుతున్నాడు. 2019 ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీనే తనకు ఆఖరిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 31 ఏళ్ల వయసులోనే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా తొంటి నొప్పితో బాధ పడుతున్న ముర్రే...కంటిన్యూగా టెన్నిస్‌ టోర్నీలు ఆడలేకపోయాడు. కొన్ని ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలు కూడా మిస్ అయ్యాడు. గాయం నుంచి కోలుకుని ముర్రే రీ ఎంట్రీ ఇవ్వడం...అదే గాయం తిరగబెట్టడంతో ఆటకు దూరమవ్వడం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది.

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ కోసం ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉన్న ముర్రే...మెన్స్ సింగిల్స్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్నాడు. టోర్నీకి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తనకు ఇదే చివరి ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ అవ్వొచ్చు అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచాడు.

నేను పూర్తి ఫిట్‌‌గా లేను.గత 20 నెలలుగా నొప్పిని భరిస్తూనే ఉన్నాను. గాయం నన్ను ఇబ్బందిపెడుతూనే ఉంది. తిరిగి కోలుకోవడానికి ఎంతగానో పోరాడాను. అయినా పూర్తిగా కోలుకోలేకపోయాను. గత ఆరు నెలలతో పోల్చుకుంటే మెరుగైన స్థితిలో ఉన్నాను. కానీ ఇబ్బందిపడుతూనే ఉన్నాను. చాలా కష్టంగా ఉంది.గాయం నుండి ఎప్పుడు పూర్తిగా కోలుకుంటానో తెలియదు. బహుశా 2019 వింబుల్డన్ టోర్నీ వరకూ మాత్రమే తాను అంతర్జాతీయ టెన్నిస్‌లో కొనసాగుతాను.
యాండీ ముర్రే










31 ఏళ్ల ముర్రే తన ఇంటర్నేషనల్ కెరీర్‌‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాడు. రెండు వింబుల్డన్ టైటిల్స్‌తో పాటు ఒక అమెరికన్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. ఐదు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరినా...టైటిల్ నెగ్గలేకపోయాడు. ఒక్క సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరి రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకున్నాడు.2013లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్ నెగ్గి 71 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆటకు గుడ్‌బై చెప్పబోతోన్న ముర్రే ఆస్ట్రేలియా ఓపెన్,ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గి కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...