Home /News /sports /

ANDREW SYMONDS DEATH HOW MONKEY GATE SCANDAL EFFECTED AUSTRALIA ALL ROUNDERS CRICKET CAREER SRD

Andrew Symonds Death : ఆ వివాదంతోనే సైమండ్స్ క్రికెట్ జీవితానికి ఎండ్ కార్డ్..! అసలేం జరిగిందంటే..

Monkey Gate Scandal

Monkey Gate Scandal

Andrew Symonds Death : అప్పటిదాకా స్టార్ ప్లేయర్‌గా ఉన్న ఆండ్రూ సైమండ్స్ ఆ వివాదం తర్వాత ఫామ్ కోల్పోయాడు. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంతకీ ఆ వివాదం ఏంటి..?

    ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవలె దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మృతితో బాధపడుతున్న ఆ జట్టు ఫ్యాన్స్ కు ఇది పిడుగు లాంటి వార్త. ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds Death) (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. షేన్ వార్న్ మరణం తర్వాత.. ఇప్పుడు మరో దిగ్గజ ఆటగాడు మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

    అయితే.. సైమండ్స్ జీవితంలో మాయరాని మచ్చగా ఓ వివాదం నిలిచింది. అదే మంకీ గేట్ వివాదం. భారత క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’ వివాదం.. ఓ కుదుపు కుదేపిసింది. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌ని, హర్భజన్ సింగ్ ‘మంకీ’ అన్నాడని... ఈ పదానికి జాత్యాహంకారానికి చిహ్నంగా భావించి వేటువేయాలని డిమాండ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.

    2008లో జరిగిన సిడ్నీ టెస్టులో అంపైర్ల నిర్ణయాలు, భారత జట్టుని తీవ్రంగా దెబ్బతీశాయి. అప్పటికే డీఆర్‌ఎస్‌ అమలులో లేకపోవడంతో టీమిండియా నష్టపోవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, బ్యాటింగ్‌లో 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 2 వికెట్లు పడగొట్టాడు భజ్జీ. అయితే ఆండ్రూ సైమండ్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన హర్భజన్ సింగ్, తనని కళ్లతో బెదిరించబోయిన ఆసీస్ ఆల్‌రౌండర్‌ని ఏదో అన్నాడు.

    ఆండ్రూ సైమండ్స్... తనని హర్భజన్ సింగ్ ‘మంకీ’ అన్నాడని ఆరోపించాడు. అయితే హర్భజన్ సింగ్ మాత్రం తాను మంకీ అనలేదని... ‘మా...కీ’ అన్నాడని చెప్పాడు. హర్భజన్ సింగ్‌కి అవతలివైపు నాన్‌స్టైయికింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో కలుగచేసుకుని... హర్భజన్ ‘మా...కీ’ అన్నాడని, తాను విన్నానని అతనికి సపోర్టుగా నిలిచాడు.

    ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. హర్భజన్ సింగ్ ‘మంకీ’ అంటూ సైమండ్స్‌ని తిట్టాడని భావించిన ఆస్ట్రేలియా, అతనికి 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు మూడు మ్యాచుల నిషేధం విధించింది.
    అయితే అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో టీమిండియా కలిసికట్టుగా హర్భజన్ సింగ్‌కి సపోర్టుగా నిలబడి... భజ్జీపై నిషేధం ఎత్తివేయకపోతే, ఆసీస్ టూర్‌ క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించారు.

    ఇది కూడా చదవండి :  ’ఆ చెత్త టీంను బ్యాన్ చేయండి.. ఎప్పుడూ వివాదాలే.. విసిగిపోయాం‘ విఖ్యాత టీంపై ఫ్యాన్స్ ఫైర్ అసలేం జరిగిందంటే?

    దీంతో టీమిండియా డిమాండ్‌కి తలొగ్గిన ఆస్ట్రేలియా జట్టు, హర్భజన్‌ సింగ్‌పై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ వివాదంపై ఆ మ్యాచ్ రిఫరీ మైక్ ప్రోక్టర్ కూడా ఈ వివాదంలో హర్భజన్ సింగ్‌దే తప్పని ఆరోపించాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసిన ఆండ్రూ సైమండ్స్... బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు.

    అప్పటిదాకా స్టార్ ప్లేయర్‌గా ఉన్న ఆండ్రూ సైమండ్స్, మంకీ గేట్ వివాదం తర్వాత ఫామ్‌ కోల్పోయాడు. ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకుని, అర్ధాంతరంగా క్రికెట్ నుంచి వైదొలిగాడు. మంకీగేట్ వివాదం వల్లే ఆండ్రూ సైమండ్స్ క్రికెట్‌ జీవితం అర్థాంతరంగా ముగిసిందని అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ అంశంలో ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) అధికారులు సైమండ్స్‌కి మద్దతుగా నిలవలేదని తెలిపాడు. దీంతో సైమండ్స్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పాంటింగ్ పేర్కొన్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Cricket, Harbhajan singh, India vs australia, Sachin Tendulkar, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు