ANDREW SYMONDS DEATH EYEWITNESSES REVEALS ANDREW SYMONDS DOGS SURVIVED CAR CRASH REFUSED TO LEAVE DEAD BODY SJN
Andrew symonds : విశ్వాసం అంటే ఇదే.. సైమండ్స్ మృతదేహం వద్ద అతడి పెంపుడు కుక్క ఏం చేసిందంటే?
పెంపుడు కుక్కతో సైమండ్స్ (PC : TWITTER)
Andrew symonds : ఆస్ట్రేలియా (Australia) దిగ్గజ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) ఆదివారం టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్వీ రేంజ్‌లో ప్రమాదం జరిగిందని చెప్పారు.
Andrew symonds : ఆస్ట్రేలియా (Australia) దిగ్గజ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) ఆదివారం టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్వీ రేంజ్‌లో ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds) మాత్రమే కారులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రత్యక్ష సాక్షులు సైమండ్స్ మరణంపై చెబుతోన్న వాస్తవాలు కన్నీటిని తెప్పించేలా ఉన్నాయి. సైమండ్స్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్లో అతడితో పాటు రెండు కుక్కలు కూడా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.
సైమండ్స్ ప్రమాదంపై ఓ మహిళా ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు ప్రకారం.. రోడ్డుపై యాక్సిడెంట్ అవ్వగానే.. తన భర్త అక్కడకు చేరుకున్నట్లు తెలిపింది. కొనఊపిరితో ఉన్న సైమండ్స్ ను బతికించేందుకు తాము తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఆమె పేర్కొంది. అయితే తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు సైమండ్స్ స్పాట్ లోనే మరణించినట్లు ఆమె పేర్కొంది. అయితే కారులో రెండు కుక్కలు ఉన్నట్లు ఆమె పేర్కొంది. అయితే ప్రమాదంలో వాటికి ఎటువంటి గాయాలు కాలేదని ఆమె తెలిపింది. తాము సైమండ్స్ దగ్గరకు చేరుకుంటుంటే అందులోని ఒక కుక్క తమకు అడ్డుగా నిలిచినట్లు పేర్కొంది. తాము సైమండ్స్ కు ఏమైనా హాని కలిగిస్తామని ఆ కుక్క భావించిందేమోనని ఆ మహిళ ఆస్ట్రేలియా కొరియర్ మెయిల్ కు పేర్కొంది. సైమండ్స్ మృతదేహం వెంటే ఆ కుక్క తిరుగుతూ అరుస్తూ ఉందని ఆమె పేర్కొనడం ఇప్పుడు అందరి చేత కన్నీళ్లు పెట్టించేలా ఉంది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యాక సైమండ్స్ తన మిగిలిన జీవితాన్ని నేచర్ కు దగ్గరగా గడుపుతున్నాడు. చేపలు పట్టడం, జంతువుల్ని వేటాడటం వంటి పనులతో కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రెండు కుక్క పిల్లలను కూడా పెంచుకుంటున్నాడు.
2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు.. 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 14 టీ20 మ్యాచ్‌లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు కూడా తీశాడు.
ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. ఆ తర్వాత అతడిని వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రెండు జట్ల తరఫున ఐపీఎల్ లో 974 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయ్. అయితే.. ఐపీఎల్ వేలంలో తనకు భారీ ధర పలకడంతోనే క్లార్క్ తో తన స్నేహం చెడిందని ఇటీవలే సైమండ్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.