అక్కడ నాకు పిచ్చెక్కింది.. అయిన కూడా భరించా!

Andre Russell

బయోబబూల్‌ సెక్యూర్‌ ఎంత కఠినమో తాజాగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌,కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ వివరించాడు

  • Share this:
    బయోబబూల్‌ సెక్యూర్‌ ఎంత కఠినమో తాజాగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌,కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ వివరించాడు. కరోనా మహమ్మారి వల్ల పదేపదే బయోబబూల్‌ ఉండడం వల్ల తను మానసిక ఆరోగ్యం దెబ్బతిందని తెలిపాడు. ఇది నా అనుభవం మాత్రమే.. బయోబబూల్‌ ఒక నరకంలా కనిపించింది. మానసికంగా చాలా వేధనకు గురయ్యాను. రెండేళ్ల నుంచి బయోబబుల్‌ అనే మాటనే ఎక్కువగా విన్నాను. ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం భారత్‌‌కు వచ్చి బయోబబూల్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఒక ఈవెంట్ నుంచి మరో ఈవెంట్‌కు వెళ్లిన నాకు బయోబబూల్‌ ఉండాల్సి వచ్చింది. ఆ ప్రాంతాన్ని చూడాలనిపించిన బయట నడిచేందుకు వీలు ఉండేది కాదు. ఇది నాకు వింతగా అనిపిస్తుంది. ఇలాంటి కఠిన పరిస్థితులను తట్టుకోవడానికి ఒక్కే ఒక్క కారణం నాకు ఇష్టమైన క్రికెట్‌ వల్లే.. ఇది మంచి అనుభవంగా భావిస్తున్న.. నా బాధ్యత నేను నిర్వహిస్తున్న'' అంటూ తెలిపాడు.
    Published by:Rekulapally Saichand
    First published: