andre russell: అదే నవ్వు రా బాబు.. గేల్‌ డైవ్‌తో అందరిలో నవ్వులు!

Andre Russell

గేల్‌ ఆ బంతిని డైవ్‌ కొట్టి మరీ ఆపేశాడు. డగౌట్‌లో నుంచి దీనిని చూసిన ఆండ్రీ రసెల్‌ తెగ నవ్వుసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

  • Share this:
    ఆటగాళ్ళు ఆటలోనే కాదు.. గ్రౌండ్ అవతల చేసే విన్యాసాలు కూడా వీక్షకులను ఆకట్టుకుంటాయి. అహ్మదాబాద్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌- కేకేఆర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గెల్ డైవ్‌ కొట్టి తీరు అందరికి నవ్వులు తెప్పించింది. భారీ శరీరకాయంతో కనిపించే గేల్  డైవ్ చేస్తూ బంతులు పట్టడం చాలా అరుదు. కానీ ఈ మ్యాచ్‌లో జాంటీ రోడ్స్‌ తరహాలో డైవ్‌ కొట్టి మరీ బంతిని ఆపేశాడు.





    కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మెన్ రాహుల్‌ త్రిపాఠి.. జోర్డాన్‌ వేసిన ఓ ఫుల్లర్‌ డెలివరీని స్ట్రైకింగ్‌లో ఉన్న మిడ్‌ వికెట్‌వైపు ఆడాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న గేల్‌ ఆ బంతిని డైవ్‌ కొట్టి మరీ ఆపేశాడు. డగౌట్‌లో నుంచి దీనిని చూసిన ఆండ్రీ రసెల్‌ తెగ నవ్వుసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీరియస్‌గా మ్యాచ్ చూస్తున్నా రసెల్‌.. గేల్‌ డైవ్‌ నవ్వును ఆపులేకపోయాడు. ఎవరైన చూస్తే ఏమనుకుంటారో ఏమో అని చేతిని అడ్డం పెట్టుకుని మరీ నవ్వుకున్నాడు. అలాగే కామెంటేటర్లు కూడా రోడ్స్‌ డైవ్‌లా ఉందంటూ కామెంట్ చేశారు.



    ఇక ఈ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ విక్టరీ కొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది కేకేఆర్. మరో 20 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. కెప్టెన్ మోర్గాన్ 40 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు చుక్కలు చూపారు కోల్ కతా బౌలర్లు. కోల్‌ కతా నైట్ రైడర్స్ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ(3/30), సునీల్ నరైన్(2/22), ప్యాట్ కమిన్స్(2/31) బంతితో రఫ్పాడించడంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి ముందు 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. మయాంక్ అగర్వాల్(34 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 31), క్రిస్ జోర్డాన్(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 30)మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. చివర్లో జోర్డాన్ భారీ సిక్సర్లు కొట్టడంతో పంజాబ్ ఆ స్కోర్ అయినా చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో ప్రసిధ్, సునీల్, కమిన్స్‌కు తోడుగా.. వరుణ్ చక్రవర్తీ, శివం మావి తలో వికెట్ తీశారు.
    Published by:Rekulapally Saichand
    First published: