Home /News /sports /

ANDHRAPRADESH CHIEF MINISTER JAGAN MOHAN REDDY WRONGLY MENTIONED PV SINDHU WON KOREA OPEN 2022 ON HIS CONGRATULATION TWEET SJN

Ap cm Jagan : సింధు విషయంలో ఏపీ సీఎం జగన్ తో సహా అందరూ పప్పులో కాలేశారుగా.!

PC : TWITTER

PC : TWITTER

AP cm Jagan : తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు (PV Sindhu) ఆదివారం అద్భుత విజయాన్ని అందుకుంది. సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ లో బరిలోకి దిగిన పీవీ సింధు ఫైనల్లో 21-9, 11-21, 21-15తో చైనాకు షట్లర్, ప్రపంచ 11 ర్యాంకర్ వాంగ్ జి యిపై అద్భుత విజయాన్ని సాధించింది.

ఇంకా చదవండి ...
AP cm Jagan : తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు (PV Sindhu) ఆదివారం అద్భుత విజయాన్ని అందుకుంది. సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ లో బరిలోకి దిగిన పీవీ సింధు ఫైనల్లో 21-9, 11-21, 21-15తో చైనాకు షట్లర్, ప్రపంచ 11 ర్యాంకర్ వాంగ్ జి యిపై అద్భుత విజయాన్ని సాధించింది. 58 నిమిషాల పాటు సాగిన ఈ తుది పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు చాంపియన్ గా నిలిచింది. దాంతో పీవీ సింధు విజయంపై పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సింధుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ’ సింగపూర్ ఓపెన్ లో విజేతగా నిలిచిన పీవీ సింధుకు శుభాకాంక్షలు. ఇది ఆమెకు తొలి సింగపూర్ టైటిల్.. ఈ ఏడాది కొరియా, స్విస్ ఓపెన్ ల తర్వాత నెగ్గిన మూడో టైటిల్ ఇది‘ అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇక్కడే సీఎం జగన్ తప్పుచేశారు. ఈ ఏడాది సింధు కొరియా ఓపెన్ లో విజేతగా నిలవలేదు.  ఈ ఏడాది ఏప్రిల్ 9న జరిగిన కొరియా సెమీఫైనల్లో ఆమె కొరియా షట్లర్ అన్ సియాంగ్ చేతిలో ఓడిపోయింది. ఆ టోర్నీలో అన్ సియాంగ్ విజేతగా నిలిచింది. కానీ, జగన్ తన ట్వీట్ లో కొరియా ఓపెన్ ను కూడా సింధు గెలిచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది సింధు సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్ టైటిల్స్ ను నెగ్గింది. అనంతరం మళ్లీ  సింగపూర్ ఓపెన్ లో విజేతగా నిలిచింది.



కొరియా ఓపెన్ 2022ని సింధు గెలిచినట్లు సీఎం జగన్ మాత్రమే ట్వీట్ చేయలేదు. ఆల్ ఇండియా రేడియో న్యూస్ దగ్గర నుంచి ప్రముఖ న్యూస్ వెబ్ సైట్స్ కూడా కొరియా ఓపెన్ లో సింధు గెలిచినట్లు తప్పుగా ట్వీట్స్ చేశాయి.



నాడు జరిగిన సెమీఫైనల్లో పీవీ సింధు ఓడిపోయిన తర్వాత భారత బ్యాడ్మింటన్ సమాఖ్య కూడా అన్ సియాంగ్ చేతిలో ఓడినట్లు అప్పట్లో ట్వీట్ కూడా చేసింది. అంతేకాకుండా కొరియా ఓపెన్ ఫైనల్ జరగాడినికి కొన్ని గంటల ముందు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కూడా ఫైనల్లో పార్న్ పవీ, అన్ సియాంగ్ అమీతుమీ తేల్చుకోనున్నట్లు తన ట్వీట్ ద్వారా పేర్కొంది.





ఇక సింధు మ్యాచ్ విషయానికి వస్తే ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిపై సింధు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్ లో ప్రత్యర్థికి కేవలం 9 పాయింట్లనే కోల్పోయిన ఆమె ఫైనల్ పోరును అద్భుతంగా ఆరంభించింది. అయితే రెండో గేమ్ లో వాంగ్ జి యి గోడకు కొట్టిన బంతిలా సింధుపై ఎదురుదాడికి దిగింది. దూకుడైన ఆటతో సింధును కోర్టులో నలువైపులా పరుగెత్తించింది. ఈ క్రమంలో రెండో గేమ్ ను వాంగ్ జి  21-11తో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చాంపియన్ ను తేల్చేందుకు మూడో గేమ్ అవసరం అయ్యింది. అయితే ఇక్కడ అద్భత ఆటతీరును కనబరిచిన సింధు ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధించి ఈ ఏడాది తొలి సూపర్ 500 టైటిల్ ను అందుకుంది. గతంలోనూ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ లో కూడా వాంగ్ జి యి పై సింధు వరుస గేముల్లో నెగ్గడం విశేషం. 
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Cm jagan, Pv sindhu, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు