కేఎస్ భరత్ (KS Bharath) ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఎన్ని సార్లు సత్తా చాటినా సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ గానే సెలక్టర్లు భావించేవారు. కానీ, ఐపీఎల్ 2021(IPL 2021) సెకండాఫ్ కేఎస్ భరత్ ను హీరోను చేసింది. కేఎస్ భరత్ ఐసీఎల్ చివరి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అక్కడ అతను కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు అవసరమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఈ తెలుగు కుర్రాడు దుమ్ము రేపుతున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో 109 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 161 పరుగులు చేశాడు. తనదైన బ్యాటింగ్‌తో హిమాచల్ బౌలర్లను చితక్కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో శ్రీకర్ భరత్ బ్యాటింగ్ తో ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. కేఎస్ భరత్‌తో పాటు అశ్విన్ హెబ్బర్(132 బంతుల్లో 10 ఫోర్లతో 100) సెంచరీతో రాణించాడు. చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) విలువైన పరుగులు చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్.. 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిషీ ధావన్(79) మినహా అంతా విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లో గిరినాథ్ రెడ్డి 4 వికెట్లతో రాణించాడు. విజయ హాజారే ట్రోఫీలో ఐపీఎల్ స్టార్లు దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : సెంచరీ తర్వాత రజనీకాంత్ స్టైల్ లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్.. వైరల్ వీడియో..
మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) ఇప్పటికే హ్యాట్రిక్ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు, మధ్యప్రదేశ్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ రెండు సూపర్ శతకాలతో శివాలెత్తాడు. తాజాగా ఆర్సీబీ మాజీ ఆటగాడు కేఎస్ భరత్ కూడా ఆ జాబితాలో చేరాడు.
గత ఐపీఎల్ వేలంలో కనీస ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో జాక్‌పాట్ కొట్టనున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడే అవకాశాన్ని అందుకున్న భరత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించాడు.
ఇది కూడా చదవండి : టీమిండియా ఫ్యాన్స్ కు రవీంద్ర జడేజా షాకింగ్ న్యూస్.. త్వరలోనే గుడ్ బై..!
ఆ ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అయిన భరత్.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మెగా వేలంలో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవాళీ క్రికెట్ ఆడిన శ్రీకర్ భరత్ 2015లో చరిత్ర సృష్టించి, రంజీ ట్రోఫీ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్ గా నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cricket, IPL 2022, Royal Challengers Bangalore