హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : ఇదేందయ్యా.. ఇది.. బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయినా పట్టించుకోని ఫీల్డర్లు.. క్రికెట్ లోనే సిల్లీ ఘటన..!

Viral Video : ఇదేందయ్యా.. ఇది.. బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయినా పట్టించుకోని ఫీల్డర్లు.. క్రికెట్ లోనే సిల్లీ ఘటన..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : అసలు బ్యాటర్ ఔటైన విషయాన్నే ఫీల్డింగ్ టీమ్ గుర్తించలేకపోయింది. కీపర్, బౌలర్‌తో పాటు ఫీల్డర్లంతా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు. అంపైర్లు కూడా అలసత్వం ప్రదర్శించారు.

క్రికెట్ (Cricket News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయ్. ఇలాంటి గేమ్ లోనూ అప్పుడప్పుడూ ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయ్. కానీ ఆస్ట్రేలియా మహిళల దేశవాళీ క్రికెట్‌లో చోటు చేసుకున్న ఓ ఫన్నీ ఘటన ఇప్పటి వరకు కనివిని ఎరుగుండరు. సాధారణంగా క్రికెట్ లో బ్యాటర్ ను ఔట్ చేయడానికి ప్రత్యర్థి టీమ్ నానా తంటాలు పడుతుంటోంది. ఔట్ చేయడానికి తమ దగ్గరున్న ప్లానులన్నీ ఉపయోగిస్తుంటారు. కానీ ఆస్ట్రేలియా మహిళల దేశవాళీ క్రికెట్‌లో బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయినా.. పెవిలియన్ చేరకుండా బ్యాటింగ్ కొనసాగించింది. అసలు బ్యాటర్ ఔటైన విషయాన్నే ఫీల్డింగ్ టీమ్ గుర్తించలేకపోయింది. కీపర్, బౌలర్‌తో పాటు ఫీల్డర్లంతా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు. అంపైర్లు కూడా అలసత్వం ప్రదర్శించారు.

అయితే టీవీ రీప్లేలో బౌలర్ విసిరిన బంతి వికెట్లపై ఉన్న బెయిల్స్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా, దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆ బ్యాటర్‌ ఔటవ్వకుండా బతికిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కీపర్, బౌలర్, ఫీల్డర్లంతా నిద్రపోతున్నారుగా అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌, టాస్మానియా జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా క్వీన్స్‌లాండ్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌ 26 పరుగుల వద్ద .. సారా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయింది. బంతి బ్యాట్‌ను దాటుకుంటూ వెళ్లి ఆఫ్‌ స్టంప్‌పైనున్న బెయిల్స్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో అవి కిందపడ్డాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అయినా అక్కడే ఉన్న కీపర్‌ ఈ విషయాన్ని గుర్తించలేదు.. మరోవైపు బౌలర్‌ అప్పీల్‌ చేయలేదు. దీంతో అంపైర్లు కూడా పట్టించుకోలేదు.

ఇది కూడా చదవండి : " విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆకలిగొన్న పులి.. మళ్లీ గర్జిస్తాడు.. "

కీపర్ గ్లోవ్స్‌ తాకి బెయిల్స్‌ పడి ఉండొచ్చని అంతా అనుకున్నారు. దీంతో బ్యాటర్‌ కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయింది. అయితే, రీప్లేలో ఆ బంతి బెయిల్స్‌ అంచులు తాకుతూ వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా, అప్పటికే బ్యాటర్‌ బతికిపోయింది. చివరికి 31 పరుగుల వద్ద జార్జియా ఔటైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వీన్స్‌లాండ్‌ 48 ఓవర్లకు (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) 223/6 స్కోర్‌ చేసింది. అనంతరం టాస్మానియా 232 పరుగులు చేసి విజయం సాధించింది.

First published:

Tags: Australia, Cricket, Trending videos, Viral Video

ఉత్తమ కథలు