హోమ్ /వార్తలు /క్రీడలు /

Amul India : బుమ్రా-సంజనా దంపతులకు అమూల్ స్పెషల్ విషెస్..సో క్యూట్ అంటున్న నెటిజన్లు..

Amul India : బుమ్రా-సంజనా దంపతులకు అమూల్ స్పెషల్ విషెస్..సో క్యూట్ అంటున్న నెటిజన్లు..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Amul India : టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, టీవీ ప్రెజెంటర్‌ సంజన గణేషన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో బుమ్రా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా నుంచి పలువురు ఆటగాళ్లు సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో అమూల్ ఇండియా తనదైన శైలిలో బుమ్రా, సంజనలకు శుభాకాంక్షలు తెలిపింది.

ఇంకా చదవండి ...

టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, టీవీ ప్రెజెంటర్‌ సంజన గణేషన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో బుమ్రా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా నుంచి పలువురు ఆటగాళ్లు సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో అమూల్ ఇండియా తనదైన శైలిలో బుమ్రా, సంజనలకు శుభాకాంక్షలు తెలిపింది. సందర్భం ఏదైనా తమ ప్రొడక్ట్‌కు ప్రచారం చేస్తూనే క్రియేటివిటీని జోడిస్తూ అమూల్‌ పోస్ట్‌లు పెడుతుంటుంది. తాజాగా ఈ క్రమంలోనే అమూల్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌ వేదికగా చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సముద్రపు ఒడ్డున బుమ్రా, సంజనల కార్టూన్‌ క్యారెక్టర్‌ పాత్రలు పెళ్లి బట్టల్లో ఓ రాతి బండపై కూర్చొని ఉండగా.. ఇద్దరూ అమూల్‌ బటర్‌తో బ్రెడ్‌ తింటున్నట్లు ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది అమూల్‌. ఈ క్రమంలో బుమ్రా చేతిలో బాల్‌, బ్యాట్‌ ఉండగా… సంజన మైక్‌తో బుమ్రాను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ఉండడం ఆకట్టుకుంటోంది.

ఇక ఈ ఫొటోపై "జాస్‌కి ప్రీత్‌ దొరికింది" అని రాసున్న వ్యాఖ్యలు నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్ట్‌ చూసిన కొందరు చాలా బాగుంది అంటూ ట్వీట్‌ చేయాగా.. మరికొందరు అమూల్‌ ప్రకటనలు ఎందుకు ఇంత క్యూట్‌గా ఉంటాయి.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. వివాహం తర్వాత 27 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా.. భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి విందు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది.


భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

First published:

Tags: Jasprit Bumrah, Sanjana Ganesan

ఉత్తమ కథలు