అమృత్‌సర్ ప్రమాద మృతుల కుటుంబాలకు క్రికెటర్ల సంతాపం!

‘ ప్రమాదం గురించి తెలియగానే గుండె బద్ధలైంది...’ అంటూ ట్వీట్ చేసిన సచిన్ టెండుల్కర్... ‘రక్తదానం చేయాలనుకునేవారు సివిల్ ఆసుపత్రికి వెళ్లాలి’ అంటూ పోస్ట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 20, 2018, 5:49 PM IST
అమృత్‌సర్ ప్రమాద మృతుల కుటుంబాలకు క్రికెటర్ల సంతాపం!
క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్
  • Share this:
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ దసరా వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బోడా పాటక్ ప్రాంతంలో దసరా సందర్భంగా ఏర్పాటుచేసిన రావణ దహన కార్యక్రమం చూసేందుకు వచ్చినవారిని రైలు ఢీకొనడంతో సుమారు 60 మంది చనిపోయిన విషయం తెలిసిందే. 72 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రావణ దహన కార్యక్రమం చూసేందుకు సుమారు 700 మందికి పైగా హాజరుకావడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. అమృత్‌సర్ ఘోర ప్రమాదంపై భారత సీనియర్ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్‌లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

‘అమృత్‌సర్ ప్రమాదం గురించి తెలియగానే గుండె బద్ధలైనట్టు అనిపించింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలి. గాయపడినవారి కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తాను...’ అంటూ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశారు.


‘అమృత్‌సర్ ప్రమాదబారిన పడిన వారందరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి...’ అంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ పోస్ట్ చేశాడు...

‘అమృత్‌సర్ ఘోర రైలు ప్రమాదం గురించి ఇప్పుడే విన్నాను. ఈ ప్రమాదం బారిన పడిన కుటుంబాల కోసం ప్రార్థిస్తాను. ప్రమాదంలో గాయపడినవారికోసం రక్తదానం చేయాలనుకుంటున్న వారు అమృత్‌సర్‌లోని సివిల్ ఆసుపత్రి, గురునానక్ ఆసుపత్రిలకి వెళ్లండి...’ అంటూ మాజీ క్రికెటర్, నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు....


‘అమృత్‌సర్ రైలు ప్రమాదం గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా... ఈ ఊహించని ప్రమాదంలో మిత్రులనూ, కుటుంబ సభ్యులనూ కోల్పోయినవారి గురించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా...’ అంటూ టర్బోనేటర్ హార్బజన్ సింగ్ ట్వీట్ చేశారు.


First published: October 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు