ఏషియాడ్: బాక్సింగ్‌లో అమిత్ పంగల్ 'గోల్డెన్' పంచ్

అమిత్ పంగల్ బాక్సింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించాడు.పురుషుల 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచాడు.

news18-telugu
Updated: September 1, 2018, 6:29 PM IST
ఏషియాడ్: బాక్సింగ్‌లో అమిత్ పంగల్ 'గోల్డెన్' పంచ్
అమిత్ పంగల్ విజయ అభివాదం (Twitter image)
  • Share this:
2018 ఏషియాడ్‌లో ఇండియా ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. అమిత్ పంగల్ బాక్సింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించాడు.పురుషుల 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచాడు.ఫైనల్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ దుస్మతోవ్‌ను ఓడించి చరిత్రను తిరగరాశాడు.భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బాక్సర్లు పసిడి పతకం నెగ్గడంలో విఫలమైనా..22 ఏళ్ల అమిత్ పంగల్ ఆ లోటు తీర్చాడు.
అమిత్ నెగ్గిన ఈ పతకంతో 18వ ఆసియా గేమ్స్ మెడల్స్‌ టేబుల్‌లో ఇండియా పతకాల సంఖ్య 66కు చేరుకుంది.67 ఏళ్ల ఏషియాడ్ చరిత్రలో భారత్‌ 65 మెడల్స్ కంటే ఎక్కువ పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి కావడం హైలైట్.ప్రస్తుత గేమ్స్‌లోని బాక్సింగ్ ఈవెంట్లలో భారత్‌కు దక్కిన తొలి బంగారు పతకం ఇదే కావడం మరో విశేషం.ప్రస్తుత గేమ్స్‌లో బాక్సింగ్‌లో ఇండియాకు రెండు పతకాలు వచ్చాయి.పురుషుల 75 కేజీల ఈవెంట్‌లో వికాస్ యాదవ్‌‌ కాంస్యం నెగ్గితే..అమిత్‌ బంగారు పతకం సాధించాడు.ఏషియాడ్‌లోనే కనీ వినీ ఎరుగని రీతిలో భారత్‌కు 66వ పతకం అందించిన ఘనత 22 ఏళ్ల అమిత్ పంగల్‌కే దక్కింది.


Published by: Prasanth P
First published: September 1, 2018, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading