ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ఆడబోయే 15 మంది ఆటగాళ్ల భారత జట్టులో సెలక్టర్లు తనను ఎంపిక చెయ్యకపోవడంతో... అంబటి రాయుడు ట్విట్టర్‌లో పరోక్షంగా సెటైర్లు వేస్తున్నాడు. తనకు బదులుగా మరో ప్లేయర్ విజయ్ శంకర్‍ను సెలెక్టర్లు ఎంపిక చెయ్యడం... విజయ్ శంకర్ త్రీ డైమెన్షనల్‌గా ఆడగలడని సెలెక్టర్లు చెప్పడంతో... అదే విషయాన్ని లెక్కలోకి తీసుకుంటూ... తాను వరల్డ్ కప్ చూసేందుకు త్రీడీ గ్లాసెస్ కోసం ఆర్డర్ ఇచ్చానని ట్విట్టర్‌లో సెటైర్ వేశాడు అంబటి రాయుడు. తద్వారా తనకు అవకాశం ఇవ్వకపోవడంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లైంది.
Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
— Ambati Rayudu (@RayuduAmbati) April 16, 2019
నిజానికి ఏడాది కాలంగా జట్టులో చోటు దక్కుతుందని భావించిన అంబటి రాయుడి ఎంపిక విషయంలో సెలక్టర్లు కొంచెం జాగ్రత్ర వహించినట్లే కనిపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత నుంచీ నాలుగో నంబర్ స్థానంలో ఆడే ఆటగాడి కోసం సెలక్టర్లు అందుబాటులో ఉన్న అందరు ఆటగాళ్లకు రొటేషన్ పద్ధతిలో అవకాశాలిచ్చారు. గత ఐపీఎల్ సీజన్‌లో ఓపెనర్‌గా రాణించిన అంబటి రాయుడి ప్రదర్శన నచ్చడంతో సెలక్టర్లు అతనికి వన్డే జట్టులో చోటు కల్పించారు.
2018లో మొత్తం 11 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్ ఆడిన అంబటి రాయుడు ఆసియాకప్‌లో హాంకాంగ్, ఆప్ఘనిస్థాన్‌పై హాఫ్ సెంచరీలు చేశాడు. ఆసియా కప్ తర్వాత రాయుడు నాలుగో స్థానానికి చక్కగా సరిపోతాడంటూ కెప్టెన్ కోహ్లీ మద్దతు పలికాడు. కానీ ఆ తర్వాత నుంచీ అంబటి రాయుడు ఫామ్ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లోనూ రాయుడు ఆశించినంతగా రాణించట్లేదు. అందువల్లే అతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
తమిళనాడులో ఐటీ దాడులు... చంద్రబాబు టార్గెట్‌గా చేయించారా...
మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తాను... మరో వివాదంలో అజంఖాన్...
సుమలత ఫేస్‌బుక్ అకౌంట్ బ్లాక్ చేశారట... ఆమె ఏం చేశారంటే...
వారణాసి నుంచీ బరిలో ప్రియాంక గాంధీ... నరేంద్ర మోదీని ఓడించబోతున్నారా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Cricket World Cup 2019