Home /News /sports /

Rachin Ravindra: రచిన్ రవీంద్ర నాన్న కూడా క్రికెటరే.. అనంతపూర్‌తో రచిన్‌కు ఉన్న సంబంధం ఏంటి? రచిన్‌కు జవగళ్ శ్రీనాథ్ ఏమవుతాడు?

Rachin Ravindra: రచిన్ రవీంద్ర నాన్న కూడా క్రికెటరే.. అనంతపూర్‌తో రచిన్‌కు ఉన్న సంబంధం ఏంటి? రచిన్‌కు జవగళ్ శ్రీనాథ్ ఏమవుతాడు?

రచిన్ రవీంద్రకు ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌కు ఉన్న సంబంధం ఏంటి? (PC: Black Caps)

రచిన్ రవీంద్రకు ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌కు ఉన్న సంబంధం ఏంటి? (PC: Black Caps)

Rachin ravindra: టీమ్ ఇండియా కాన్పూర్ టెస్టులో విజయం సాధించకుండా పోరాడి అడ్డుకున్న న్యూజీలాండ్ అరంగేట్రం బ్యాటర్ రచిన్ రవీంద్రపై ప్రశంసలు జల్లలు కురుస్తున్నాయి. భారత మూలాలున్న ఈ క్రికెటర్ బెంగళూరుకు చెందిన తల్లిదండ్రులకు జన్మించాడు. చిన్నతనంలో క్రికెట్‌ కోసం ఇండియాలో పర్యటించాడు.

ఇంకా చదవండి ...
  ఒక్క వికెట్.. ఒకే ఒక్క వికెట్ తీసుంటే కాన్పూర్ టెస్టులో భారత జట్టు (Team India) విజయం సాధించి ఉండేది. కానీ చివరి 9 ఓవర్లు అద్భుతంగా ఆడి న్యూజీలాండ్ (New Zealand) బ్యాటర్లు రచిన్ రవీంద్ర (Rachin Ravindra), అజాజ్ పటేల్ (Ajaj Patel) భారత్‌కు విజయాన్ని దూరం చేశారు. రచిన్ రవీంద్ర 91 బాల్స్ ఎదుర్కొని 18 పరగులు చేయగా.. అజాజ్ పటేల్ 23 బంతుల్లో 2 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఇద్దరూ భారత మూలాలున్న క్రికెటర్లే కావడం విశేషం. అజాజ్ పటేల్ కుటుంబం ముంబైకి, రచిన్ రవీంద్ర కుటుంబం బెంగళూరుకు చెందిన వాళ్లు కావడం విశేషం. ఇక కాన్పూర్ టెస్టులో అరంగేట్రం చేసిన రచిన్ రవీంద్ర 1999 నవంబర్ 18న న్యూజీలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో పుట్టాడు. రచిన్ పేరు టెస్టు మ్యాచ్‌కు ముందే ఫేమస్ అయిపోయింది. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరులోని 'ర'.. సచిన్ (Sachin) పేరులోని 'చిన్' స్పూర్తిగా అతడికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తున్నది. బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి, దీపా దంపతులకు రచిన్ జన్మించాడు. రవి కృష్ణమూర్తి సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ఆర్కిటెక్ట్. ఆయన 1990ల్లోనే న్యూజీలాండ్‌కు వలస వెళ్లాడు. అక్కడే రచిన్ జన్మించాడు.

  రవి కృష్ణమూర్తి బెంగళూరులో ఉన్న సమయంలో క్రికెట్ ఆడేవాడు. ఆయన క్లబ్ క్రికెట్ ఆడుతూనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఇక న్యూజీలాండ్ వెళ్లిన తర్వాత కూడా క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 'ది హట్ హాక్స్' అనే క్రికెట్ క్లబ్‌ను స్థాపించాడు. ఈ క్లబ్ చేసే పని ఏంటంటే.. న్యూజీలాండ్‌కు చెందిన యువ ప్లేయర్లను ఇండియాలో పర్యటనకు తీసుకొని వచ్చేది. ప్రతీ ఎండాకాలం సెలవుల్లో యువ క్రికెటర్లను ఇండియాకు తీసుకొని వచ్చి ఇక్కడ క్లబ్ క్రికెట్ ఆడించే వాళ్లు. అలా న్యూజీలాండ్‌కు చెందిన యువకులకు క్రికెట్‌లో మెలకువలు నేర్పించే వాళ్లు. రచిన్ రవీంద్ర అమ్మనాన్న తరపు బంధువులు అందరూ ప్రస్తుతం బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో ఉంటున్నారు. ప్రతీ సారి సెలవులకు బంధువుల ఇంటికి వచ్చేవాడు. కానీ 2011 నుంచి మాత్రం నాన్న స్థాపించిన 'ది హట్ హాక్స్' క్రికెట్ క్లబ్ తరపున ఆట కోసం వచ్చాడు.

  IPL 2022 Retention: గత సీజన్‌లో భారీ రేటు.. కానీ ఈ సారి జట్టులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి.. ఎవరా ఆటగాళ్లు?
  చిన్నప్పుడు ఇండియా పర్యటనకు వచ్చిన రచిన్ రవీంద్ర (కుడిపైపు చివరన) (PC: Twitter/Ganeshan)


  రచిన్ తన పర్యటనలో ఎక్కువగా బెంగళూరులోనే కాకుండా దానికి సమీపంలోనే ఉన్న అనంతపురంలో కూడా క్రికెట్ ఆడేవాడు. అక్కడి రంజీ ప్లేయర్లతోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెటర్లతో మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా పర్యటించి భారత్‌లో పిచ్‌లు ఎలా స్పందిస్తాయో అప్పటి నుంచే నేర్చుకున్నాడు. రచిన్‌ నాన్న స్థాపించి క్లబ్ తరపునే న్యూజీలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ కూడా ఇండియాలో పర్యటించడం విశేషం. జిమ్మీ నీషమ్ కూడా చిన్నప్పుడు బెంగళూరు, హైదరాబాద్‌లో పర్యటించి అనుభవాన్ని సంపాదించాడు.

  Lionel Messi: అరుదైన రికార్డు నెలకొల్పిన లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. 7వ సారి బాలెన్ డి ఓర్ అవార్డు సొంతం


  రచిన్ అరంగేట్రం టెస్టులో మ్యాచ్ రిఫరీగా ఉన్న మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ బెంగళూరుకు చెందిన వ్యక్తే. రచిన్ నాన్న రవి కృష్ణమూర్తి చాలా కాలం శ్రీనాథ్‌తో కలసి క్రికెట్ ఆడాడు. ఇప్పటికీ రవి, శ్రీనాథ్ మంచి స్నేహితులు. రచిన్ కూడా శ్రీనాథ్‌ను 'శ్రీ అంకుల్' అని పిలుస్తుంటాడు. ఇలా ఇండియాతో ఎంతో అనుబంధం ఉన్న రచిన్.. ఇక్కడే క్రికెట్‌ పైన ఎంతో అనుభవం సంపాదించిన రచిన్.. చివరకు ఇండియానే గెలవకుండా అడ్డుగోడలా నిలిచి ఒక్క రోజులో ఫేమస్ అయిపోయాడు.
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Team india, Test Cricket

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు