ఆసియా గేమ్స్‌లోనే భారత్‌‌కు 'ఆల్ టైమ్ రికార్డ్' మెడల్స్

18వ ఏషియాడ్‌లోనే భారత్‌కు కనీ వినీ ఎరుగని రీతిలో పతకాలు దక్కాయి. 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై ఈవెంట్‌లో అమిత్ నెగ్గిన స్వర్ణ పతకంతో  65 పతకాల సొంత రికార్డ్‌‌ను భారత్ బ్రేక్ చేసింది.

news18-telugu
Updated: September 1, 2018, 7:17 PM IST
ఆసియా గేమ్స్‌లోనే భారత్‌‌కు 'ఆల్ టైమ్ రికార్డ్' మెడల్స్
ఏషియాడ్‌లో భారత మెడలిస్ట్‌లు (Twitter Images)
  • Share this:
ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌‌లో భారత్ చరిత్రను తిరగరాసింది. 18వ ఏషియాడ్‌లోనే భారత్ ఖాతాలో కనీ వినీ ఎరుగని రీతిలో పతకాలు చేరాయి. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఏషియాడ్‌లో రికార్డ్ స్థాయిలో మెడల్స్ నెగ్గి సంచలనాలకు మారుపేరుగా మారింది. 14వ రోజుకు ముందు ఏషియాడ్‌లో సొంత రికార్డ్ బద్దలు కొట్టడానికి ఒక్క పతకం దూరంలో నిలిచింది. పదమూడు రోజుల పోటీలు ముగిసే సరికి భారత్ 65 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. పద్నాలుగో రోజు అమిత్ పంగల్ పురుషుల 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచాడు. అమిత్ నెగ్గిన పతకంతో  మెడల్స్‌ టేబుల్‌లో ఇండియా పతకాల సంఖ్య ఏషియాడ్‌లోనే తొలిసారిగా 65 దాటింది.
67 ఏళ్ల ఏషియాడ్ చరిత్రలో భారత్‌ 65 కంటే ఎక్కువ  మెడల్స్ నెగ్గడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ  ఆసియా గేమ్స్ చరిత్రలోనే ఇండియాకు  ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2010 గ్వాంగ్జూ గేమ్స్‌లో భారత్ మొత్తంగా 65 పతకాలు సాధించింది. పద్నాలుగో రోజు పోటీల్లో 65 పతకాల మ్యాజిక్ మార్క్ దాటిన భారత్ ...ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసుకుంది.బంగారు పతకాలు, సిల్వర్ మెడల్స్ నెగ్గడంలో ఇండియా రికార్డ్‌లు బద్దలు కొట్టింది.14వ రోజు పోటీల్లో ఇండియా సొంతమైన తొలి నాలుగు పతకాల్లో రెండు స్వర్ణాలు,ఒక రజత పతకం,ఓ కాంస్యం ఉన్నాయి.
పురుషుల 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై ఈవెంట్‌లో అమిత్ పంగల్,బ్రిడ్జ్ మెన్స్ పెయిర్ ఈవెంట్‌లో బర్దన్ ప్రణబ్,శిబ్‌నాథ్ సర్కార్‌ స్వర్ణ పతకాలు నెగ్గి భారత పతకాన్ని రెపరెపలాడించారు.స్క్వాష్ టీమ్ ఈవెంట్‌లో దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప, సునైనా కుర్విల్లా, తన్వీ ఖన్నాలతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్‌లో ఓడి రజత పతకం సొంతం చేసుకుంది.బ్రాంజ్ మెడల్‌ కోసం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 2-1తో విజయం సాధించి కాంస్యం నెగ్గింది. మ్యాచ్  ప్రస్తుత గేమ్స్‌లో ఇండియాకు తొలి ఏడు రోజుల్లో షూటర్లు, ఎనిమిదో రోజు నుంచి అథ్లెట్లు రికార్డ్ స్థాయిలో పతకాలందించారు.
Published by: Prasanth P
First published: September 1, 2018, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading