ఏషియాడ్ : భారత్ బంగారు పతకాల మోత

ఆసియా గేమ్స్‌లో భారత్ నెగ్గిన బంగారు పతకాల సంఖ్య 15. 14వ రోజు పోటీల్లో నెగ్గిన రెండు స్వర్ణ పతకాలు భారత్‌ను పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలబెట్టాయి.

news18-telugu
Updated: September 1, 2018, 7:46 PM IST
ఏషియాడ్ : భారత్ బంగారు పతకాల మోత
ఏషియాడ్‌లో భారత బంగారు పతక విజేతలు (Twitter Images)
 • Share this:
18వ ఆసియా గేమ్స్‌‌లో భారత్ బంగారు పతకాల వేటలో రికార్డ్‌ల మోత మోగించింది. ప్రస్తుత ఏషియాడ్ 14 రోజుల పోటీల్లో ఇండియా సాధించిన పసిడి పతకాల సంఖ్య 15కు చేరింది.పద్నాలుగో రోజు పోటీల్లో అనూహ్యంగా రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. పురుషుల 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై ఈవెంట్‌లో అమిత్  పంగల్, బ్రిడ్జ్ మెన్స్ పెయిర్ ఈవెంట్‌లో బర్దన్ ప్రణబ్,శిబ్‌నాథ్ సర్కార్‌ గోల్డ్ మెడల్స్ నెగ్గి చరిత్రను తిరగరాశారు. ఆసియా గేమ్స్‌ చరిత్రలోనే ఒకే టోర్నీలో ఇప్పటివరకూ అత్యధికంగా 15 గోల్డ్ మెడల్స్ నెగ్గిన భారత్..ప్రస్తుత గేమ్స్‌తో ఆ రికార్డ్ సమం చేసింది. 14వ రోజు పోటీల్లో నెగ్గిన రెండు స్వర్ణ పతకాలు భారత్‌ను పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలబెట్టాయి.
18వ ఏషియాడ్‌లో భారత బంగారు పతక విజేతలు :


 • 14వ రోజు పురుషుల 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై ఈవెంట్‌లో అమిత్ పంగల్‌కు పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.

 • 14వ రోజు బ్రిడ్జ్ మెన్స్ పెయిర్ ఈవెంట్‌లో బర్దన్ ప్రణబ్,శిబ్‌నాథ్ సర్కార్‌‌ స్వర్ణం నెగ్గారు.

 • 12వ రోజు పురుషుల 1500 మీటర్ల పరుగులో జిమ్సన్ జాన్సన్ స్వర్ణం సాధించాడు.

 • 12వ రోజు మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత్ పసిడి పతకం సొంతం చేసుకుంది.


 • 11వ రోజు మహిళల హెప్టాథ్లాన్‌లో స్నప్న బర్మన్ స్వర్ణ పతకం నెగ్గింది.

 • 11వ రోజు పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పీందర్ సింగ్ బంగారు పతకం సాధించాడు.

 • 10వ రోజు పురుషుల 800మీటర్ల స్ప్రింట్‌లో మన్‌జీత్ సింగ్ పసిడి పతకం సొంతంచేసుకున్నాడు.

 • 9వ రోజు పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు.

 • 7వ రోజు పురుషుల షాట్‌పుట్‌లో తేజిందర్ పాల్ సింగ్‌ తూర్ స్వర్ణ పతకం నెగ్గాడు.

 • 6వ రోజు ఏషియాడ్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌ స్వర్ణ పతకం నెగ్గారు.

 • 6వ రోజు మెన్స్ క్వాడ్రాపుల్ స్కల్స్ రోయింగ్‌లో భారత్‌కు దత్తు బాబన్, ఓమ్ ప్రకాష్, సుఖ్‌మీత్ సింగ్, సవర్ణ్ సింగ్‌ స్వర్ణ పతకం అందించారు.

 • 5వ రోజు మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో రాహి సర్నోబత్‌ స్వర్ణ పతకం నెగ్గింది.

 • 3వ రోజు 10 మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరి స్వర్ణ పతకం నెగ్గాడు.

 • 2వ రోజు మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

 • తొలిరోజు పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో బజ్‌రంగ్ పూనియా స్వర్ణం సాధించాడు.


పురుషుల 1500 మీటర్ల పరుగులో జిమ్సన్ జాన్సన్ స్వర్ణం సాధించగా ...మహిళల 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లోనూ స్వర్ణం భారత్ సొంతమైంది.ప్రస్తుత ఏషియాడ్‌లో అథ్లెటిక్స్‌లోనే భారత్‌కు బంగారు పతకాల పంట పండింది. అథ్లెటిక్స్‌ నుంచే ఏడు గోల్డ్ మెడల్స్ రావడం విశేషం. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ నుంచి 5 స్వర్ణాలు, షాట్ పుట్,జావెలిన్ త్రో ఈవెంట్స్ నుంచి ఒక్కో పతకం వచ్చాయి. రెజర్లు,షూటర్లు రెండేసి పతకాలు అందించగా..రోయింగ్ ,టెన్నిస్ ఈవెంట్స్ నుంచి ఒక్కో పతకం ఇండియా ఖాతాలో చేరాయి. 12వ రోజు 1500 మీటర్ల పరుగులో జిమ్సన్ జాన్సన్,4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో హిమదాస్, పోవమ్మ రాజు,సరితాబెన్ లక్ష్మణ్‌బాయ్,విస్మయ కొరోత్ రెండు స్వర్ణపతకాలు అందించి సగర్వంగా భారత జాతీయ పతకాన్ని రెపరెపలాడించారు.పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన బజ్‌రంగ్‌ పూనియా ప్రస్తుత ఏషియాడ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించాడు. బజ్‌రంగ్ తర్వాత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ భారత్‌కు రెండో పతకం అందించింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 2018 ఏషియాడ్‌లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా మాత్రమే కాదు రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ ట్రాక్ రికార్డ్‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా అరుదైన ఘనతను  సొంతం చేసుకుంది. రోయింగ్, టెన్నిస్ మెన్స్ డబుల్స్‌,షూటింగ్,విభాగాల్లో భారత్‌కు అనూహ్యంగా స్వర్ణాలు రావడం విశేషం. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో రాహి సర్నోబత్‌,10 మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరి స్వర్ణాలు నెగ్గి చరిత్రను తిరగరాశారు.మెన్స్ క్వాడ్రాపుల్ స్కల్స్ రోయింగ్‌లో దత్తు బాబన్, ఓమ్ ప్రకాష్, సుఖ్‌మీత్ సింగ్, సవర్ణ్ సింగ్‌ గోల్డ్ మెడల్‌ సాధించి దేశానికే గర్వ కారణంగా నిలిచారు.11వ రోజు మహిళల హెప్టాథ్లాన్‌లో స్నప్న బర్మన్,పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పీందర్ సింగ్ పసిడి పతకాలు నెగ్గి యావత్ భారతాన్ని ఆశ్చర్యపరచారు.ప్రస్తుత గేమ్స్‌తోనే భారత 15 గోల్డ్ మెడల్స్ రికార్డ్ బద్దలయ్యే అవకాశాలున్నాయి.67 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేయగలదో లేదో అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:


ఏషియాడ్: బాక్సింగ్‌లో అమిత్ పంగల్ 'గోల్డెన్' పంచ్


ఏషియాడ్: అథ్లెటిక్స్‌లోనే భారత్‌కు అత్యధిక పతకాలు

Published by: Prasanth P
First published: September 1, 2018, 7:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading