ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరానికి సై

మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్ జరిగే లుజ్నికి స్టేడియం, జులై 15న జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా వేదికకానుంది.

news18
Updated: June 18, 2018, 11:28 AM IST
ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరానికి సై
మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్ జరిగే లుజ్నికి స్టేడియం, జులై 15న జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా వేదికకానుంది.
  • News18
  • Last Updated: June 18, 2018, 11:28 AM IST
  • Share this:
రష్యా వేదికగా జూన్‌ 14 నుంచి 21వ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్ సమరం ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు కనువిందు చేయనుంది. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్ జరిగే లుజ్నికి స్టేడియం, జులై 15న జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా వేదికకానుంది.

టోర్నమెంట్‌లో భాగంగా 32 జట్ల మధ్య 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. రష్యాలోని 11 ప్రధాన నగరాల్లోని 12 స్టేడియంలు మ్యాచ్‌లకు వేదికకానున్నాయి. మొత్తం 32 జట్లు 8 గ్రూప్‌లుగా విడిపోయి కప్ కోసం తలపడనున్నాయి. ఆతిథ్య రష్యా జట్టు గ్రూప్ ఏలో ఉండగా...హాట్ ఫ్యావరేట్ జట్లు స్పెయిన్, పోర్చుగల్ గ్రూప్ బీలో ఉన్నాయి. మరో హాట్ ఫ్యావరేట్ ఫ్రాన్స్ గ్రూప్ సీలోనూ...అర్జెంటీనా గ్రూప్ డీలోనూ ఉన్నాయి. బలమైన ఫుట్‌బాల్ జట్లుగా గుర్తింపు ఉన్న ఇటలీ, హాలండ్ జట్లు ఈ సారి ప్రపంచకప్‌లో లేకపోవడం ఆ దేశాల ఫుట్‌బాల్ ప్రియులకు నిరాశ కలిగిస్తోంది.

ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ జర్ననీ గ్రూప్ ఎఫ్‌లో బరిలోకి దిగనుంది. 2006 తర్వాత ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పెట్టింది పేరైన యూరప్ గడ్డపై జరగనున్న తొలి ప్రపంచకప్ ఇదే కావడం విశేషం. దీంతో యూరప్ దేశాల్లో పండుగ వాతావరణం నెలకొంటోంది.

ఈ సారి వరల్డ్ కప్ ఫ్యావరేట్ ఎవరన్న దానిపై క్రీడాభిమానులు, మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీతో పాటు ఫ్రాన్స్, స్పెయిన్ హాట్ ఫ్యావరేట్స్‌గా భావిస్తున్నారు. అలాగే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండిన బెల్జియం డార్క్ హార్స్ కావచ్చన్న అభిప్రాయాన్ని కూడా మాజీ ఫుట్‌బాల్ ఆటగాళ్లు వ్యక్తపరుస్తున్నారు.

ఈ సారి, 2022లో ఖతార్‌లో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ గేమ్స్‌లో మాత్రమే చివరగా 32 జట్లు తలపనున్నాయి. 2026 వరల్డ్ కప్ నుంచి అదనంగా 16 జట్లతో కలిపి మొత్తం 48 జట్లు కప్ కోసం తలపడనున్నాయి.
Published by: Janardhan V
First published: May 25, 2018, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading