7 పరుగులకే ఆలౌట్.. ఆ జట్టులో 11 మందీ డకౌట్..

ఈ మ్యాచ్‌లో ఊహకందని మంచి రికార్డ్‌లు.. అంతకు మించిన చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఓ టీమ్ ఏకంగా 7 పరుగులకే ఆలౌటయింది. వచ్చిన ఆ రన్స్ కూడా ఎక్స్‌ట్రాల రూపంలో లభించినవే..!

ఈ మ్యాచ్‌లో ఊహకందని మంచి రికార్డ్‌లు.. అంతకు మించిన చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఓ టీమ్ ఏకంగా 7 పరుగులకే ఆలౌటయింది. వచ్చిన ఆ రన్స్ కూడా ఎక్స్‌ట్రాల రూపంలో లభించినవే..!

 • Share this:
  క్రికెట్ మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఒక్కోసారి గొప్ప రికార్డ్‌లు సాధిస్తే.. మరోసారి చెత్త రికార్డ్‌లు నమోదవుతుంటాయి. ఒకసారి భారీ స్కోర్ సాధిస్తే.. ఇంకోసారి 10 పరుగులు కూడా చేయలేం. ఇది కూడా అలాంటిదే..! ఈ మ్యాచ్‌లో ఊహకందని మంచి రికార్డ్‌లు.. అంతకు మించిన చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఓ టీమ్ ఏకంగా 7 పరుగులకే ఆలౌటయింది. వచ్చిన ఆ రన్స్ కూడా ఎక్స్‌ట్రాల రూపంలో లభించినవే..! ఆ జట్టులో ఉన్న 11 బ్యాట్స్‌మెన్‌లో అందరూ డకౌట్ అయ్యారు. కనీసం ఒక్క పరుగు కూడా తీయకుండానే వెనుదిరిగారు.

  ఇక అవతలి జట్టు ఏకంగా 754 పరుగుల తేడాతో విజయం సాధించింది. చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమి ఇది. ముంబైలో జరిగిన ఇంటర్ స్కూల్ మ్యాచ్‌లో ఈ షాకింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ఇటీవల ముంబైకి చెందిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ (SVIS), చిల్ట్రెన్స్ వెల్ఫేర్ స్కూల్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన స్వామి వివేకానంద స్కూల్ జట్టు 39 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 761 పరుగులు చేసింది. ఆ టీమ్ ప్లేయర్ మయేకర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. 118 బంతుల్లో (56*4, 7*6) ఏకంగా 338 రన్స్ సాధించి నాటౌట్‌గా నిలిచాడు.

  భారీ లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన చిల్ట్రెన్స్ వెల్ఫేర్ స్కూల్.. ఏ మాత్రం పోటీనివ్వకపోగా అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. 6 ఓవర్లలో కేవలం 7 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐతే వచ్చిన ఆ 7 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే రావడం విశేషం. ఆ జట్టులో ఉన్న 11 మంది బ్యాట్స్‌మెన్లలో అందరూ డకౌట్ అయ్యారు. అలోక్ పాల్ 6 వికెట్లు తీయగా, వరద్ వాజే 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ స్కోర్ కార్డ్ వైరల్ కావడంతో ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: