ఫుట్‌బాల్ ఫీవర్: అందరి చూపు రష్యా వైపే...

ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు పలు ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాభిమానులు, పర్యాటక ప్రియులు రష్యాకు క్యూకడుతున్నారు. క్రీడాభిమానులు, పర్యాటక ప్రియుల్లో ఫుట్‌బాల్ ఫీవర్‌ను గుర్తించిన ట్రావెల్‌ సంస్థలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ప్రకటించాయి.

news18
Updated: June 18, 2018, 11:27 AM IST
ఫుట్‌బాల్ ఫీవర్: అందరి చూపు రష్యా వైపే...
2018 FIFA World Cup
  • News18
  • Last Updated: June 18, 2018, 11:27 AM IST
  • Share this:
FIFA World cup
2018 FIFA World Cup


యావత్ ప్రపంచం ఇప్పుడు రష్యా వైపే చూస్తోంది. ప్రపంచకప్‌ ఫుట్‌బాల్ సమరం రష్యా వేదికగా జూన్‌ 14 నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి. జులై 15న మాస్కోలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఫుట్‌బాల్ పండగ పరిసమాప్తంకానుంది. రష్యాలోని 11 ప్రధాన నగరాల్లోని 12 స్టేడియంలు మ్యాచ్‌లకు వేదికకానున్నాయి.

మ్యాచ్‌ల కోసం రష్యాలోని ప్రధాన నగరాలు సర్యాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్ధీపాలంకరణలతో ప్రధాన నగరాలు, పర్యాటక స్థలాలు, హోటళ్లను సిద్ధం చేస్తున్నారు. విదేశీ పర్యాటకుల కోసం భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. తమ సాంప్రదాయం, సంస్కృతి, కళలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు పలు ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాభిమానులు, పర్యాటక ప్రియులు రష్యాకు క్యూకడుతున్నారు. చివరి రోజుల్లో రష్‌ను ముందే ఊహించిన యాత్రికులు...ఇప్పటికే తమ పర్యటనకు సంబంధించిన విమాన టిక్కెట్లు, హోటల్స్ బుకింగ్స్ చేసుకున్నారు. క్రీడాభిమానులు, పర్యాటక ప్రియుల్లో ఫుట్‌బాల్ ఫీవర్‌ను గుర్తించిన ట్రావెల్‌ సంస్థలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ప్రకటించాయి. రష్యాలోని ప్రధాన పర్యాటక స్థలాల సందర్శనతో పాటు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు టిక్కెట్లను ఆఫర్ చేశాయి. జనవరి మాసంలో మొదలైన ట్రావెల్, హోటల్స్ బుకింగ్స్..మార్చి మాసంలో దాదాపుగా పూర్తయ్యాయి. విమాన టిక్కెట్లతో పాటు...ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో రష్యాలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లలో గదులు ఇప్పటికే పూర్తిగా బుకింగ్ అయ్యాయి.

ప్రపంచకప్ ఫుట్‌బాల్‌కు క్వాలిఫై కానప్పటికీ భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ అభిమానులు, పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో రష్యాకు పయనమయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాదితో పోలిస్తే రష్యా పర్యటనకు వెళ్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే భారత్ నుంచి ప్రపంచకప్ ఫుట్‌బాల్ గేమ్స్ వీక్షించేందుకు వెళ్లే భారతీయుల సంఖ్య 50 శాతానికిపైగా పెరిగినట్లు ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఏకంగా 15 లక్షల మంది రష్యాలో పర్యటించేందుకు ట్రావెల్, హోటల్స్ బుకింగ్ చేసుకున్నారు.
Published by: Janardhan V
First published: May 25, 2018, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading