All england open final: భారత యువ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ (lakshya sen) చరిత్ర సృష్టించలేకపోయాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ (All england championship)బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను గెలిచి మూడో భారత ప్లేయర్ గా చరిత్ర పుటల్లో చోటు సంపాదించాలనుకున్న అతడి కల నెరవేరలేదు. ఆదివారం 53 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్ 10-21 15-21తో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచనంబర్ వన్ విక్టోర్ అక్సల్ సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. ఏక పక్షంగా సాగిన మ్యాచ్ లో అక్సల్ సెన్ ఆటకు లక్ష్యసేన్ దగ్గర జవాబే లేకుండా పోయింది. ఆట ఆరంభం నుంచి దూకుడు కనబర్చిన అతడు వరుస గేముల్లో మ్యాచ్ ను ముగించి ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ గా అవతరించాడు.
టోర్నమెంట్ లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన పీవీ సింధు (PV Sindhu) రెండో రౌండ్ లోనే నిష్క్రమించగా... ఎటువంటి అంచనాలు లేని లక్ష్యసేన్ తన ఆటతో దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అతడు మాజీ చాంపియన్ లీ జి జియాపై గెలిచి ఫైనల్ చేరాడు. ఈ క్రమంలో 21 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోన్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ను లక్ష్యసేన్ ఒడిసి పట్టేస్తాడని అందరూ భావించారు. అంతేకాకుండా భారత దిగ్గజ షట్లర్లు ప్రకాశ్ పదుకొనె (prakash padukone), పుల్లెల గోపిచంద్ (pullela gopichand)ల సరసన నిలుస్తారని అనుకున్నారు. అయితే ఫైనల్లో లక్ష్యసేన్ చతికిల పడ్డాడు. వరుస గేముల్లో ఓడి రన్నరప్ గా నిలిచాడు. దాంతో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన భారత ప్లేయర్లుగా ఇప్పటికీ ప్రకాశ్ పదుకొనె (1980), పుల్లెల గోపిచంద్ (2001)లు మాత్రమే ఉన్నారు.
There was stopping him today ? ?? Viktor Axelsen at his imperious best, as he wins the YONEX All England Men’s Singles with a 21-10 21-15 victory over Lakshya Sen!#YAE22 pic.twitter.com/ZPPv5qZ1Qv
— ? Yonex All England Badminton Championships ? (@YonexAllEngland) March 20, 2022
ఆట ఆరంభం నుంచే విక్టోర్ దూకుడు కనబరిచాడు. ఎక్కడా తడబడకుండా పాయింట్లు సాధిస్తూ లక్ష్యసేన్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అతడు తొలి ఐదు పాయింట్లను సాధించి 5-0తో ఆధిక్యంలో నిలిచాడు. ఇదే దూకుడును కనబర్చి తొలి గేమ్ ను సులభంగా దక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్ లోనూ డెన్మార్క్ షట్లర్ లక్ష్యసేన్ పై ఆధిపత్యం కనబరిచాడు. వరుస పెట్టి పాయింట్లు సాధిస్తూ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు. అయితే 17-10తో ఆధిక్యంలో విక్టోర్ ఆధిక్యంలో ఉన్న సమయంలో ఇరు ఆటగాళ్లు ఒక పాయింట్ కోసం ఏకంగా 70 షాట్ల పాటు సుదీర్ఘ ర్యాలీ ఆడారు. అనంతరం కొన్ని పాయింట్లు సాధించిన లక్ష్యసేన్ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కడా ఒత్తిడికి గురి కాని విక్టోర్ విజేతగా నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Pullela Gopichand, Pv sindhu