ALL ENGLAND CHAMPIONSHIP LAKSHYA SEN CREATES HISTORY BY ENTERING FINALS AT ALL ENGLAND CHAMPIONSHIP SJN
All england championship: చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్..ప్రకాశ్ పదుకొనె, గోపిచంద్ ల తర్వాత ఫైనల్ చేరిన ప్లేయర్ గా ఘనత
లక్ష్యసేన్ (PC: TWITTER)
All england championship: భారత యువ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ (lakshya sen) చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ (All england championship) బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫైనల్లో ప్రవేశించాడు. తద్వారా పురుషుల విభాగంలో ప్రకాశ్ పదుకొనె (prakash padukone), పుల్లెల గోపిచంద్ (pullela gopichand)ల తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ లో ఫైనల్ చేరిన మూడో ఇండియన్ ప్లేయర్ గా ఘనతెక్కాడు.
All england championship: భారత యువ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ (lakshya sen) చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ (All england championship) బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫైనల్లో ప్రవేశించాడు. తద్వారా పురుషుల విభాగంలో ప్రకాశ్ పదుకొనె (prakash padukone), పుల్లెల గోపిచంద్ (pullela gopichand)ల తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ లో ఫైనల్ చేరిన మూడో ఇండియన్ ప్లేయర్ గా ఘనతెక్కాడు. శనివారం గంటా 16 నిమిషాల పాటు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో లక్ష్యసేన్ 21-13, 12-21, 21-19తో మాజీ చాంపియన్ లీ జి జియా (మలేసియా)పై సూపర్ విక్టరీ సాధించాడు. ఇక ఆదివారం జరిగే మ్యాచ్ లో గనుక లక్ష్యసేన్ విజయం సాధిస్తే ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన మూడో ప్లేయర్ గా నిలుస్తాడు. ప్రకాశ్ పదుకొనె (1980)లో, పుల్లెల గోపిచంద్ (2001)లో భారత్ తరఫున ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ను గెలిచారు.
క్వార్టర్ ఫైనల్లో లక్షసేన్ కు వాకోవర్ లభించింది .అతడి ప్రత్యర్థి గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో లక్ష్యసేన్ నేరుగా సెమీఫైల్లోకి అడుగుపెట్టాడు. ఇక సెమీఫైనల్లో మలేసియాకు చెందిన మాజీ చాంపియన్ లీ జి జియాతో తలపడ్డాడు. తొలి గేమ్ లో వరుస పాయింట్లతో హోరెత్తించిన లక్ష్యసేన్ 21-13తో సొంతం చేసుకున్నాడు. అనంతరం పుంజుకున్న లీ జి జియా... రెండో గేమ్ లో మంచి ఆటతీరు కనబరిచాడు. స్మాష్ షాట్లతో పాటు సుదీర్ఘ ర్యాలీ షాట్లతో లక్ష్యసేన్ పై ఒత్తిడిని పెంచాడు. దాంతో లక్ష్యసేన్ పాయింట్ల కోసం కష్టపడ్డాడు. అదే సమయంలో అనవసర తప్పిదాలతో గేమ్ ను దూరం చూసుకుని మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్ కు వెళ్లింది.
HE DID IT 😍🔥@lakshya_sen becomes the 5️⃣th 🇮🇳 shuttler to reach the FINALS at @YonexAllEngland as he gets past the defending champion WR-7 🇲🇾's Lee Zii Jia 21-13, 12-21, 21-19, in the enthralling semifinals encounter 💪
మూడో గేమ్ ఆరంభంలో మలేసియా షట్లర్ దూకుడు కనబరిచాడు. దాంతో 11-9తో ఒకసారి... 14-12తో రెండోసారి మలేసియా షట్లర్ ఆధిక్యంలో నిలిచాడు. అయితే తీవ్ర ఒత్తిడి మధ్య అద్భుత ఆటతీరు కనబరిచిన లక్ష్యసేన్ వరుసగా పాయింట్లు సాధించి అంతరాన్ని తగ్గించాడు. దాంతో ఇరువురు కూడా 18-18తో సమంగా నిలిచాడు. అయితే ఇక్కడ వరుసగా మూడు పాయింట్లు సాధించిన లక్ష్యసేన్ 20-18తో మ్యాచ్ పాయింట్ కు వచ్చాడు. అనంతరం లీ జి జియా ఒక పాయింట్ సాధించినా... ఆ తర్వాత వెంటనే పాయింట్ సాధించిన లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్ల ోకి ప్రవేశించిన మూడో ఇండియన్ ప్లేయర్ గా ఘనత కెక్కాడు. ఓవరాల్ గా నాలుగో ఇండియన్ (మహిళల విభాగాన్ని కలుపుకుంటే). సైనా నెహ్వాల్ 2015లో రన్నరప్ గా నిలిచింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.