Home /News /sports /

ALL ARJUN STARRER PUSHPA MOVIE WAS SAW BY TEAM INDIA PLAYERS HANUMA VIHARI TWEET GOES VIRAL SRD

Team India - Pushpa : ఒడియమ్మ.. పుష్ప మూవీ టీమిండియా ఆటగాళ్లకు కూడా పిచ్చెక్కించిందిగా..!

Team India (PC : Twitter)

Team India (PC : Twitter)

Team India - Pushpa : సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. అయితే, రెండో టెస్టుకు ముందు టీమిండియా కాస్త ఎంజాయ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల విడుద‌లైన స్ట్రైలీష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం పుష్ప‌ను టీమిండియా ఆటగాళ్లంతా వీక్షించారు.

ఇంకా చదవండి ...
    ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవని టీమిండియా (Team India) ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే ఊపుతో సెకండ్ టెస్ట్ కూడా గెలవాలన్న కసితో ఉంది కోహ్లీసేన. జనవరి 3న జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు మ్యాచ్‌ (India Vs South Africa)లో తలపడనుంది. సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. అయితే, రెండో టెస్టుకు ముందు టీమిండియా కాస్త ఎంజాయ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల విడుద‌లైన స్ట్రైలీష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం పుష్ప‌ను టీమిండియా ఆటగాళ్లంతా వీక్షించారు.అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

    సినిమా తెలుగు ఆట‌గాడు హ‌నుమ విహారి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు. సినిమా చూస్తున్నంత సేపు తామంత పుష్ప ట్రాన్స్‌లోనే ఉన్నామ‌ని ట్వీట్‌లో చెప్పాడు. విల‌క్ష‌ణ న‌టుడు అల్లు అర్జున్, పుష్ప చిత్ర బృందానికి ఈ సంద‌ర్భంగా భార‌త ఆట‌గాళ్లు అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాకుండా పుష్ప‌-2 కోసం ఎదురుచూస్తున్న‌ట్లు హ‌నుమ విహారి పేర్కొన్నాడు.


    ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప మానియా న‌డుస్తోంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అనేక మంది ఈ డైలాగ్ చెప్పి ఆక‌ట్టుకున్నారు. టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాతోపాటు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ పుష్ప డైలాగ్‌తో ఆక‌ట్టుకున్నారు. ఇద్ద‌రు కూడా డైలాగ్ ప్లే అవుతుంటే దానికి తగ్గ‌ట్టుగా లిప్స్ క‌దిలిస్తూ, అచ్చం అల్లు అర్జున్ హ‌వాభావాల‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు.

    ఇది కూడా చదవండి : అయ్యో.. పాపం స్మిత్..! స్టార్ క్రికెటర్ కు లిఫ్ట్ లో 55 నిమిషాల పాటు నరకం..

    30 ఏళ్ల నుంచి సఫారీ గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా.. వాండరర్స్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. ఆ రికార్డును ఇప్పుడు కూడా కొనసాగించాలని కోహ్లీసేన టార్గెట్‌గా పెట్టుకుంది. 1997‌లో రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ సెంచరీ చేయడం, 2006లో సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్ విక్టరీ ఈ మైదానంలోనే వచ్చాయి. 2018లో విరాట్ ఓవర్‌సీస్ టెస్ట్ విక్టరీ కూడా ఈ మైదానం నుంచే మొదలైంది. దీంతో, అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Allu Arjun, Hanuma vihari, India vs South Africa, Pushpa, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు