Viral Video : టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా మామూలుగా లేదు. అప్పుడే దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. ఈ సినిమాకు క్రికెటర్లు మరింత పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్నటించిన ‘పుష్ప’ (Pushpa) సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఇంకా ఈ సినిమా మేనియా నడుస్తూనే ఉంది. ఈ సినిమాకు క్రికెటర్లు మరింత పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే మన దేశ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ (David Warner) కూడా పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించాడు. ఆ తర్వాత సురేష్ రైనా, డ్వేన్ బ్రావో, బంగ్లా క్రికెటర్ కూడా ఇదే బాటలో పయనించారు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని శ్రీవల్లీ సాంగ్ కు వీరందరూ ఫిదా అయినట్టు ఉన్నారు. దీంతో.. సందర్భంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తమ టాలెంట్‌కి పని చెబుతూ సరదా తీర్చుకుంటున్నారు క్రికెటర్లు. ఇంతటితో ఆగకుండా వారు చేసిన డ్యాన్సులు, ఇమిటేట్ చేసిన డైలాగులను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి సంబరపడిపోతున్నారు.
తాజాగా, ఓ బామ్మ సైతం తాను కూడా తగ్గేదేలేదంటూ పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌ను చిందేసింది. ఈ హడావుడి చేసిన ముసలావిడ ఎవరో అనామకురాలనుకుంటే పొరపాటే. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా నాన్నమ్మ అయిన ఈ బామ్మ.. వయసు సహకరించకపోయినా ఎంతో ఉత్సాహంతో పాటకు స్టెప్పేసింది. ఆమె పక్కనే హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. "అవర్ ఓన్ పుష్ప నాని" అంటూ హార్ధిక్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. నెటిజన్లు బామ్మ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు.
అంతేకాకుండా టీమిండియా యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా ఈ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. అలాగే పుష్ప డైలాగ్‌ను డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా చెప్పి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు విదేశాల్లో పలువురు చిన్నారులు కూడా పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన మెగా హిట్ సాధించేసింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో పుష్ప సినిమా పాటలు ఊపేస్తున్నాయి. ముఖ్యమంగా యూట్యూబ్‌ను షేక్ చేసిన ఊ అంటావా పాట గానీ, లేదా శ్రీవల్లి పాటగానీ చాలా పాపులర్ అయిపోయింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.