• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ALEX HARTLEY RORY BURNS BEN DUCKETT ENGAGE IN WAR OF WORDS AFTER ENGLANDS DEFEAT IN NARENDRA MODI STADIUM SRD

India vs England : ఇంగ్లండ్ ఓటమిపై ఆ దేశ మహిళా క్రికెటర్ సెటైర్లు...మండిపడ్డ పురుష క్రికెటర్లు..

India vs England : ఇంగ్లండ్ ఓటమిపై ఆ దేశ మహిళా క్రికెటర్ సెటైర్లు...మండిపడ్డ పురుష క్రికెటర్లు..

Alex Hartley (Photo Credit)

India vs England : కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్‌ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్‌ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. ఇక ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్లీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  • Share this:
    కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్‌ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్‌ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరికి టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సిరీస్ లో 2-1తో ముందడుగు వేసింది. టెస్టు క్రికెట్‌ అత్యంత తక్కువ బాల్స్‌లోనే మ్యాచ్‌ ముగియడం చరిత్రలో ఏడోసారి మాత్రమే. తాజాగా పింక్‌ బాల్‌ టెస్టులో 842 బంతుల్లోనే ఫలితం వచ్చింది. ఇక ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్లీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలెక్స్ హార్ట్లీ‌పై ఆ దేశ పురుష క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిని తక్కువ చేస్తూ సెటైరిక్‌గా అలెక్స్ హార్ట్లీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తమను అవమానించేలా ఉందని భావించిన ఆ దేశ పురుష క్రికెటర్లు రోరీ బర్న్స్, బెన్ డకెట్ ట్విటర్ వేదికగానే హార్ట్లీకి చివాట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంగ్లండ్ మహిళలు, న్యూజిలాండ్ మహిళల మధ్య జరిగిన సెకండ్ వన్డే‌ను ఉద్దేశించి అలెక్స్ హార్ట్లీ చేసిన ట్వీట్ బెడిసి కొట్టింది. "బాగుంది అబ్బాయిలు.. న్యూజిలాండ్ మహిళల మ్యాచ్ ప్రారంభానికి ముందే టెస్ట్ మ్యాచ్‌ను పూర్తి చేయడం బాగుంది" అని ట్వీట్ చేసింది.

    తమ మ్యాచ్‌ను హైలైట్ చేసే క్రమంలో హార్ట్లీ ఇంగ్లండ్ ఓటమిని తక్కువ చేసేలా ట్వీట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదని అభిమానులు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. ఈ ట్వీట్‌పై రోరీ బర్న్స్ సైతం తీవ్ర అభంతరం వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్‌కు మద్దతు లభించేందుకు తాము ఓడిపోవాలనుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదన్నాడు. " అబ్బాయిలందరూ మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వడానికి ఇది నిరాశపరిచే వైఖరి" అంటూ హార్ట్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. ఇక రోరీ బర్న్స్ ట్వీట్‌ను బెన్ స్టోక్స్‌తో సహ జేమ్స్ అండర్సన్ లైక్ చేశారు. అయితే తర్వాత ఏం ఆలోచించాడో ఏమో కానీ రోరీ బర్న్స్ ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. అయినా బర్న్స్‌ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.




    ఇక హార్ట్లీ ట్వీట్‌పై బెన్ డకెట్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పరమ చెత్త ట్వీట్ అంటూ పేర్కొన్నాడు. "యావరేజ్ ట్వీట్.. మహిళలు ఓడితే పురుషుల జట్టులోని ఆటగాళ్లు చప్పట్లు కొట్టే ఏమోజీలను షేర్ చేస్తారని అనుకోకండి" అంటూ హార్ట్‌లీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.



    ఇక తన ట్వీట్‌పే రేగిన దుమారంపై హార్ట్లీ స్పందించింది. తన ఉద్దేశం అదికాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. " నేను చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవర్నీ తక్కువ చేస్తూ ట్వీట్ చేయలేదు. మేమంతా టెస్ట్ అభిమానులమే" అని స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేసింది.ఇక, ఈ మ్యాచ్ విక్టరీతో వరల్ట్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానానికి దూసుకెళ్లింది. అయితే, చివరి టెస్ట్ లో గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియా ఫైనల్లో అడుగుపెడుతోంది. ఒక వేళ ఇంగ్లండ్ గెలిస్తే..ఆస్ట్రేలియాను అదృష్టం వరించనుంది.
    Published by:Sridhar Reddy
    First published: