Ranji Trophy : భారత దేశవాళి క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2022 సీజన్ లో మధ్యప్రదేశ్ (MadhyaPradesh) జట్టు కొత్త చరిత్రను లిఖించిన విషయం తెలిసిందే. ఆదివారం ముగిసిన ఫైనల్లో 41 సార్లు చాంపియన్ ముంబై (Mumbai) టీంను 6 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ టీం చిత్తు చేసి తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ విజయంలో ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ (vhandrakant pandit) పాత్ర ఎంతో ఉంది. మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీని గెలిచిన అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా మొదలు.. వసీం జాఫర్, రవిశాస్త్రి లాంటి వారు చంద్రకాంత్ ను ఆకాశానికి ఎత్తుతూ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసందే. తాజాగా ఆ జాబితాలోకి భారత షినిషర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) కూడా చేరాడు. ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ (EPL) ఫుట్ బాల్ టోర్నీలోని మాంచెస్టర్ యునైటెడ్ కు కోచ్ గా పనిచేసిన అలెక్స్ ఫెర్గూసన్ తో చంద్రకాంత్ పండిట్ ను పోలుస్తూ కార్తీక్ ట్వీట్ చేశాడు.
క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) లాంటి ప్లేయర్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అలెక్స్ ఫెర్గూసన్ ది. అతడి పర్యవేక్షణలోని మాంచెస్టర్ యునైటెడ్ అనేక సార్లు లీగ్ చాంపియన్ గా నిలిచింది. తాజాగా చంద్రకాంత్ పండిట్ కూడా తన పర్యవేక్షణలోని జట్టును రంజీ చాంపియన్ గా నిలుపుతూ చాంపియన్ కోచ్ గా అవతరించాడు. చంద్రకాంత్ తాజా టైటిల్ తో కలిపి కోచ్ గా 6వ సారి రంజీ ట్రోఫీని నెగ్గాడు. చంద్రకాంత్ కోచ్ గా ఉన్నప్పుడు ముంబై మూడు సార్లు చాంపియన్ గా నిలచింది. అనంతరం విదర్భను రెండు సార్లు రంజీ చాంపియన్స్ గా చేశాడు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ ను ఆ జాబితాలో నిలిపాడు.
Lovely pictures @BCCI
Couldn’t be happier for CHANDU sir . Amazing
- Understanding personality traits
- Preparing them accordingly
- Using them tactically to win championships ????
ALEX FERGUSON of RANJI trophy #GOAT https://t.co/N7CdX3WU2b
— DK (@DineshKarthik) June 26, 2022
To go across 3 states and win Ranji trophies is a remarkable achievement and a true reflection of his dedication and commitment to the job. Well done Chandu #RanjiTrophy pic.twitter.com/2OglcYNcYV
— Ravi Shastri (@RaviShastriOfc) June 26, 2022
మధ్యప్రదేశ్ 1999 రంజీ సీజన్ లో ఫైనల్ కు చేరుకుంది. ఆ జట్టుకు చంద్రకాంత్ పండిట్ కెప్టెన్ గా ఉన్నాడు. కర్ణాటక జట్టుతో తుది పోరు జరగ్గా.. మ్యాచ్ ను మధ్యప్రదేశ్ అద్భుతంగా ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్ లో 75 పరుగుల ఆధిక్యాన్ని కూడా సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అనూహ్యంగా కుప్పకూలి రన్నరప్ గా నిలిచింది. దాదాపు 23 ఏళ్ల విరామం తర్వాత మధ్యప్రదేశ్ మళ్లీ రంజీ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించగా.. చంద్రకాంత్ కోచ్ పాత్ర వహించాడు. అయితే ఈసారి ఎటువంటి తప్పు చేయకుండా మధ్యప్రదేశ్ కు రంజీ ట్రోఫీని అందించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Dinesh Karthik, England, Football, Hardik Pandya, India vs england, Ravi Shastri, Rohit sharma, Virat kohli