Home /News /sports /

AKSHAY KARNEWAR VIDARBHA BOWLER WHO HAS CREATED A NEVER BEFORE SEEN RECORD IN T20S HE BOWLS WITH RIGHT AND LEFT HANDS JNK

Two Hands Bowling: రెండు చేతులతో బౌలింగ్ చేయడం చూశారా? దేశవాళీ క్రికెట్‌లో బౌలింగ్‌తో ఆశ్చర్యపరుస్తున్న అక్షయ్ కర్నేవార్

రెండు చేతులతో బౌలింగ్ చేస్తున్న అక్షయ్ కర్నేవార్ (PC: Twitter Video Grab)

రెండు చేతులతో బౌలింగ్ చేస్తున్న అక్షయ్ కర్నేవార్ (PC: Twitter Video Grab)

Akshay Karnewar: విదర్భ రంజీ జట్టుకు చెందిన అక్షయ్ కర్నేవార్ దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఈ బౌలర్ రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ వేయడమే కాకుండా ఒక మ్యాచ్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా 2 వికెట్లు తీసుకున్నాడు.

    క్రికెట్‌లో (Cricket) మీరు ఎడమ చేతి వాటం బౌలర్‌ని చూసుంటారు.. కుడి చేతులో బౌలింగ్ వేసే వారిని చూసుంటారు. అలాగే కుడి చేతి బ్యాటర్ ఎడమ చేతి బౌలింగ్ చేయడం చూసుంటాం.. అదే సమయంలో ఎడమ చేతి బ్యాటర్ కుడి చేతి బౌలింగ్ కూడా చూశాం. కానీ క్రికెట్‌లో ఒక భారతీయ బౌలర్ రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు ఏమీ గల్లీ క్రికెటరో.. సరదాగా ఆడే వ్యక్తో కాదు. దేశవాళీ క్రికెట్‌లో (Domestic Cricket) విదర్భ (Vidarbha) తరపున ఆడుతున్నాడు. కుడి చేతితో ఆఫ్ స్పిన్, ఎడమ చేతితో స్లో ఆర్మ్ బౌలింగ్ వేస్తున్నాడు. అతడే విదర్భకు చెందిన అక్షయ్ కర్నేవార్. సోమవారంతో ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Syed Mustaq Ali Trophy) అక్షయ్ కర్నేవార్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేసి సంచలనం సృష్టించడమే కాకుండా.. వికెట్లు కూడా బాగానే తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 6 మ్యాచ్‌లలో కలిపి 24 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొత్తం కలిపి 3.56 ఎకానమీతో 100 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

    అక్షయ్ కర్నేవార్ బౌలింగ్ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఒక ఓవర్‌లో ఒకే యాక్షన్‌తో బౌలింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఒక మ్యాచ్‌లో ఎన్ని రకాలుగా అయినా బౌలింగ్ చేయవచ్చు. ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని కర్నేవార్ ప్రత్యర్థి జట్టును కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులే ఇచ్చాడు. అంతే కాకుండా ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి విదర్భ సెమీఫైనల్‌కు వెళ్లింది. కర్నేవార్ తన కెరీర్‌లో 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు ఇదే అతడి అత్యుత్తమ ప్రదర్శన. ఇక అతడు టీ20 క్రికెట్‌లో మొత్తం 48 వికెట్లు తీసుకున్నాడు.

    Team India: టీమ్ ఇండియా టెస్టుల్లో మళ్ళీ వరల్డ్ నెంబర్ 1 అయ్యేనా? అలా కావాలంటే ఏం చేయాలి?







    కర్నేవార్ పేరు మీద ఒక ప్రపంచ రికార్డు కూడా నమోదయ్యింది. ఒక మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి ఒక్క పరుగులు కూడా ఇవ్వలేదు. నాలుగు మెయిడిన్ ఓవర్లు వేయడమే కాకుండా రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో మరే ఇతర బౌలర్ ఈ ఘనత సాధించలేదు. మరోవైపు అతడు ఏ టీ20 మ్యాచ్‌లో కూడా 30 పరుగులు ఇవ్వలేదు. అతడు అత్యధికంగా మేఘాలయపై 26 పరుగులు ఇచ్చాడు. ఇక ప్రీక్వార్టర్ ఫైనల్‌లో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇదే అతడు అత్యధికంగా పరుగులు ఇచ్చిన మ్యాచ్‌లు.

    World Cup: భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జట్టు.. ఢిల్లీలో ఘన స్వాగతం.. రేపటి నుంచి వరల్డ్ కప్


    మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పేద కుటుంబంలో అక్షయ్ కోర్నెవార్ జన్మించాడు. అక్షయ్ తండ్రి మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అక్షయ్ 15 ఏళ్ల వయసులో నాగ్‌పూర్‌లోని నవకేతన్ క్రికెట్ క్లబ్‌లో ఆడటం ప్రారంభించాడు. ఈ క్లబ్‌కు చెందిన ఆటగాళ్లు ఎక్కువగా విదర్భ జట్టుకే ఆడుతుంటారు. అలా అక్షయ్ కూడా విదర్బ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు