Home /News /sports /

AJINKYA RAHANE REFUSES TO CUT KANGAROO ON CAKE SA

జాతీయ జెండాను పట్టుకున్న కంగారూ కేక్ కట్ చేయని రహానే...క్రికెటర్ దేశ భక్తికి నెటిజన్స్ ఫిదా

Ajinkya Rahane

Ajinkya Rahane

Republic Day 2021: భారత క్రికెటర్ అజింక్య రహానె దేశ భక్తికి నెటిజన్లు ఫిదా అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేళ క్రికెట్ అభిమానులు అజింక్య రహానె దేశ భక్తిని గుర్తుచేసుకుంటున్నారు.

    భారత క్రికెటర్ అజింక్య రహానె దేశ భక్తికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కొమ్ములు తిరిగిన  ఆస్ట్రేలియా మెడలు వచ్చి చారిత్రక టెస్ట్ సిరీస్ విజయం సాధించిన భారత్  క్రికెట్ జట్టు ఆటగాళ్ళకు ఇటీవల స్వదేశం చేరుకోవడం తెలిసిందే. వారికి అభిమానులు డోలు వాయిద్యాలతో  ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్ళు  లేకపోయినప్పటికీ  టీమిండియాను  అజింక్య రహానె జట్టును విజయపథంలో నడిపించిన తీరు అందరినీ మెప్పించింది. అతని నాయకత్వంలో భారత్ జట్టు ఆసీస్‌ను ధీటుగా ఎదుర్కొన్న తీరు అభిమానులను ఫిదా చెసింది.

    ఫ్యాన్స్‌తో పాటు అతని ఇంటి చేరుకున్న బంధువులు,సన్నిహితులు రహానెను అభినందించారు. చప్పట్లు.. గులాబి రేకులు చల్లి తాత్కలిక సారథిని కొనయాడారు. ఈ సమయంలో కేక్‌ను కట్ చేయమని అతన్ని కొరగా దాన్ని తిరస్కరించాడు. కారణమేమిటంటేఆ కేక్‌పై కంగారూ కూర్చొని భారత జాతీయ జెండాను పట్టుకుని ఉంది. దీన్ని చూసిన రహానే  ఆస్ట్రేలియా జాతీయ జంతువైన కంగారూకు.. మువ్వెన్నల జెండాను గౌరవిస్తూ.. కేక్‌ను కట్‌ చేయనని తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహానె వ్యక్తిత్వాన్ని, దేశ భక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను గణతంత్ర దినోత్సవ వేళ భారత క్రికెట్ అభిమానులు, దేశ భక్తులు గుర్తుచేసుకుంటున్నారు.

    జాతీయ జెండాను చేతబట్టిన కంగారూ కేక్‌ను కట్ చేసేందుకు నిరాకరించిన అజింక్యా రెహానె


    సీనియర్ల గైర్హాజరీతో అసలు టెస్ట్ సిరీస్ డ్రా అయినా చేసుకుంటారా...? అనే దశ నుంచి ఏకంగా టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఓ పక్క గాయాలు వెన్నాడుతున్నా.. కొండంత అండ విరాట్ కోహ్లి లేకున్నా.. యువ భారత జట్టు అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంలో కెప్టెన్ అజింక్యా రహానేది కీలక పాత్ర. కూల్ గా ఉంటూ కంగారూలను బెంబేలెత్తించిని ఈ కెప్టెన్ రాకతో అతడి ఇంట సంబరాలు మిన్నంటాయి. అజింక్యాకు ఇంతకుముందు ఊహించని ఘన స్వాగతం లభించింది.

    ఇదిలా ఉండగా దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అజింక్యా రహానే...దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.



    మొత్తానికి అజింక్యా రహానె దేశ భక్తి  పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. జట్టుకు చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించిపెట్టిన రహానేను మెచ్చుకుంటున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Cricket, Republic Day 2021

    తదుపరి వార్తలు