ఆ సలహా ఇచ్చింది రాహుల్ ద్రవిడే: రహానె

Rahul Dravid

పరిమిత ఓవర్లలలో రాణించాలని గట్టి పట్టుదలతో ఉన్న రహాన్ ఐపీఎల్‌లో మంచి ఆట తీరును కనబరుస్తున్నారు.. ద్రవిడ్‌ పర్యవేక్షణలో రాటుతేలిన రహానె రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా మారాడు. తాజాగా దీప్‌దాస్‌ గుప్తాతో చిట్ చాట్‌లో పాల్గోన్న రహాన్.. ఇలా మారడానికి రాహుల్ ఎలాంటి సూచనలు చేశాడో తెలుపుతూ పలు విషయాలను వెల్లడించారు.

  • Share this:
టీమిండియాలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు వారసుడుగా పేరు తెచ్చుకున్న ప్లేయర్ అజింక్య రహానె. టెస్ట్ క్రికెట్‌లో ద్రవిడ్ లాంటి ఆట తీరును కనిబరుస్తూ కీలక ఆటగాడిగా నిలిచాడు. స్వదేశం,విదేశం అని కాకుండా ఎక్కడైన రాణించే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్‌. ఇప్పటివరకు 65 మ్యాచ్‌ల్లో 11 శతకాలను సాదించాడు. అద్భుత ఆటతీరుతో రాణిస్తున్న రహానెకు జట్టు యాజమాన్యం వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు సైతం అప్పగించింది.

అయితే టెస్ట్ క్రికెటర్‌గా మారడంతో క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. చివరిసారిగా 2016లో టీ20 మ్యాచ్ ఆడగా 2018 ఫిబ్రవరిలో చివరి వన్డే మ్యాచ్‌లో కనిపించారు. అయితే పరిమిత ఓవర్లలలో రాణించాలని గట్టి పట్టుదలతో ఉన్న రహాన్ ఐపీఎల్‌లో మంచి ఆట తీరును కనబరుస్తున్నారు.. ద్రవిడ్‌ పర్యవేక్షణలో రాటుతేలిన రహానె రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా మారాడు. తాజాగా దీప్‌దాస్‌ గుప్తాతో చిట్ చాట్‌లో పాల్గోన్న రహానే.. ఇలా మారడానికి రాహుల్ ఎలాంటి సూచనలు చేశాడో తెలుపుతూ పలు విషయాలను వెల్లడించారు.

"బంతి చూసి బలంగా కొట్టడమే టీ20 పార్మలా అన్నారు. మనం కొట్టే షాట్లు క్లాసిక్‌గా కొట్టనవసరం లేదని కేవలం బంతిని మాత్రమే చూసి బలంగా షాట్లు కొట్టాలన్నాడు. చెత్త షాట్‌ ఆడబోయి ఔటయ్యామని అనుకొకూడదన్నారు. మనం ఆడబోయే షాట్‌ ఎలాంటిదనే విషయానికి పట్టించుకోకూడదని సృష్టం చేశారు. మనం ఆడబోయే ప్రతి బాల్ మీద బ్యాట్స్‌మన్‌ ప్రభావం కనపడాలని రాహుల్‌ భాయ్‌ సూచించారని" రహానె స్పష్టంచేశాడు.
Published by:Rekulapally Saichand
First published: