Ajinkya Rahane : పోలా..అదిరిపోలా.. ఓటమెరుగని అజింక్య రహానేకి గ్రాండ్ వెల్ కమ్..వీడియో వైరల్

Ajinkya Rahane

Ajinkya Rahane : ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గబ్బా గర్జనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుని కాలర్ ఎగరేసింది. ఇందుకు కారణం టీమిండియా సమిష్టి ప్రదర్శన. కానీ అంతకన్నా ముందు ఒకరి గురించి చెప్పుకోవాలి. అతనే ఓటమెరుగని కెప్టెన్ అజింక్య రహానే.

 • Share this:
  ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గబ్బా గర్జనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుని కాలర్ ఎగరేసింది. ఇందుకు కారణం టీమిండియా సమిష్టి ప్రదర్శన. కానీ అంతకన్నా ముందు ఒకరి గురించి చెప్పుకోవాలి. అతనే ఓటమెరుగని కెప్టెన్ అజింక్య రహానే. ఇప్ప‌టి వర‌కూ ఇండియ‌న్ టీమ్‌కు టెస్టుల్లో ర‌హానే కెప్టెన్సీ చేసిన ఏ మ్యాచ్ కూడా ఓడిపోక‌పోవ‌డం విశేషం. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై సాధించిన మ‌రో చారిత్ర‌క విజ‌యంతో త‌న రికార్డును ర‌హానే మ‌రింత ప‌దిలం చేసుకున్నాడు. ఇప్ప‌టి వ‌రకూ ర‌హానే ఐదు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. అందులో టీమిండియా నాలుగు గెలిచి, ఒక‌టి డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టుల్లో కెప్టెన్సీ చేయ‌గా.. మూడు విజ‌యాలు, ఒక డ్రాతో తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇలా ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించిన కెప్టెన్ అంజిక్య రహానేకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫిని దక్కించుకున్న రహానే టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసలజల్లు కురుస్తోంది. దీంతో ముంబైలోని ఆయన అభిమానులు,స్థానికులు కూడా రహానే ఘన స్వాగతం పలికారు. గురువారం ముంబైలోని ఆయన నివాసానికి తిరిగివచ్చిన తరుణంలో బాండ్‌ బాజాలతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.

  టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన కూల్‌ కెప్టెన్‌ రహానేకు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కుమార్తె ఆర్యను ఎత్తుకుని వస్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రహానె భార్య రాధిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లితో పోలిస్తే రహానే కెప్టెన్సీ పూర్తిగా భిన్నం. గ్రౌండ్‌లో కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. వికెట్ ప‌డినా, మ్యాచ్‌లో గెలిచినా అత‌ని ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. గాల్లోకి పిడి గుద్దులు కురిపిస్తూ సంబ‌రాలు చేసుకుంటాడు. కానీ ర‌హానే పూర్తి విరుద్ధంగా ఉంటాడు. బ్రిస్బేన్‌లో అంత‌టి విజ‌యం సాధించిన త‌ర్వాత కూడా అత‌నిలో ఎలాంటి భావోద్వేగాలు క‌నిపించ‌లేదు. కామ్‌గా టీమ్ మేట్స్‌తో సెల‌బ్రేట్ చేసుకున్నాడు. నిజానికి ఆస్ట్రేలియాలాంటి టీమ్‌పై, వాళ్ల సొంత‌గ‌డ్డ‌పై ఆడాలంటే కోహ్లిలాంటి దూకుడైన కెప్టెనే క‌రెక్ట్ అని చాలా మంది భావించారు. కానీ ర‌హానే వాళ్ల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేశాడు.


  ఆస్ట్రేలియాలో క్లిష్ట స‌మ‌యంలో కోహ్లి టీమ్‌ను విడిచిపెట్టి వెళ్లాడు. ఇలాంటి స‌మ‌యంలో మ‌రో కెప్టెన్ అయితే చేతులెత్తేసే వాడేనేమో. కానీ ర‌హానే ఆ త‌ర్వాతి టెస్ట్‌లోనే టీమ్‌ను ముందుండి న‌డిపించాడు. సెంచ‌రీతో మ్యాచ్‌ను గెలిపించి.. సిరీస్‌ను స‌మం చేశాడు. దీనికితోడు కెప్టెన్‌గా అత‌ను వేసిన ప్ర‌తి ఎత్తుగ‌డా ఫ‌లించింది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో మూడో పేస్‌బౌల‌ర్ కంటే ముందే స్పిన్న‌ర్ అశ్విన్‌ను బౌలింగ్‌కు దించ‌డం మ్యాచ్‌ను మ‌లుపు తిప్పింది. అత‌డు కెప్టెన్సీ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ టీమ్‌ను గాయాలు వేధించాయి. టీమ్‌లోని ప్ర‌ధాన ప్లేయ‌ర్స్ ఒక్కొక్క‌రుగా గాయంతో దూర‌మ‌వుతూ వ‌చ్చారు. కానీ అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌నే ర‌హానే అద్భుతంగా వాడుకున్నాడు. చివ‌రి టెస్ట్‌లో ఆడిన న‌లుగురు పేస్‌బౌల‌ర్ల మొత్తం అనుభ‌వం కేవ‌లం నాలుగు టెస్టులే. అలాంటి బౌలింగ్ లైన‌ప్‌తోనే గ‌బ్బా స్టేడియంలో 13 ఏళ్ల త‌ర్వాత ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసిన ఘ‌న‌త సాధించాడు.
  Published by:Sridhar Reddy
  First published: