HOME »NEWS »SPORTS »ajinkya rahane denies to cut cake here is the reason ms

Ajinkya Rahane: అజింక్యాకు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం.. కానీ ఆ పని చేయలేనన్న కూల్ కెప్టెన్

Ajinkya Rahane: అజింక్యాకు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం.. కానీ ఆ పని చేయలేనన్న కూల్ కెప్టెన్
అజింక్యా ఇంట్లో సంబురాలు

టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన కూల్‌ కెప్టెన్‌ రహానేకు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కుమార్తె ఆర్యను ఎత్తుకుని వస్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. అయితే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత తన ప్రాణ మిత్రులు చేసిన పనికి షాకయ్యారు. వాళ్లు బలవంతం పెట్టినా ఆ పని మాత్రం చేయలేనన్నాడు..

  • News18
  • Last Updated: January 21, 2021, 23:18 IST
  • Share this:
    ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ గెలిచిన అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. సీనియర్ల గైర్హాజరీతో అసలు డ్రా అయినా చేసుకుంటారా...? అనే దశ నుంచి ఏకంగా టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఓ పక్క గాయాలు వెన్నాడుతున్నా.. కొండంత అండ విరాట్ కోహ్లి లేకున్నా.. యువ భారత జట్టు అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంలో కెప్టెన్ అజింక్యా రహానేది కీలక పాత్ర. కూల్ గా ఉంటూ కంగారూలను బెంబేలెత్తించిని ఈ కెప్టెన్ రాకతో అతడి ఇంట సంబరాలు మిన్నంటాయి. అజింక్యాకు ఇంతకుముందు ఊహించని ఘన స్వాగతం లభించింది.

    కాగా చారిత్రాత్మక సిరీస్ ను గెలిచిన సందర్భంగా.. రహానే అభిమానులు, అతడి ప్రాణ స్నేహితులు.. ఒక ప్రత్యేకమైన కేక్ ను తయారుచేశారు. ఆ కేక్ పై ఒక కంగారూ భారత జెండాను పట్టుకున్నట్టు ఉంచారు. రహానే స్నేహితుడు హిమాన్షు పాటిల్ ఈ కేక్ ను స్వయంగా తయారుచేయించారు. హోమ్ చెఫ్ బెకరీ యజమాని అదితి లిమాయే కామత్ దీనిని దగ్గరుండి తయారుచేశారు.



    రహానే కోసం తయారుచేయించిన ఈ ప్రత్యేక కేక్ ఎగ్ లెస్ కేక్ అని అతడి మిత్రులు తెలిపారు. అజింక్యాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం. అందుకే దానిని చాక్లెట్ తో తయారుచేయించారు. అయితే ఈ కేక్ ను కోయడానికి అజింక్యా రహానే నిరాకరించాడు. కేక్ మీద ఉన్న కంగారు బొమ్మను తాను కట్ చేయలేదని.. దానిని తొలగించాలని తన మిత్రులకు చెప్పాడు.



    ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరికి కేక్ మీద ఉన్న కంగారూ బొమ్మను తీసేసి.. మామూలు కేక్ ను మాత్రమే కట్ చేశాడు అజింక్యా.



    కంగారూ ఆస్ట్రేలియా జాతీయ జంతువు. ఆసీస్ జట్టును కంగారూస్ అని పిలుస్తుంటారు. అయితే కేకు మీద దానిని కోస్తే అది వారిని అగౌరవ పరిచినట్టే అవుతుందని రహానే భావించాడు.
    Published by:Srinivas Munigala
    First published:January 21, 2021, 23:17 IST