AJINKYA RAHANE CHETESHWAR PUJARA PICKED IN RANJI TROPHY SQUADS AND ITS A GOLDEN CHANCE FOR TEAM INDIA SENIOR BATTERS SRD SJN
Rahane - Pujara : పుజారా, రహానేలకు చావో రేవో.. అక్కడ సత్తా చాటితేనే భారత జట్టులో చోటు..
Ajinkya Rahane - Cheteshwar Pujara
Rahane - Pujara : ఇటీవలి కాలంలో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు గోల్డెన్ ఛాన్స్. భారత జట్టులో చోటు సంపాదించుకోవాలంటే.. తమ బ్యాటింగ్ సత్తా చూపాల్సిందే.
భారత క్రికెట్ జట్టు (Indian cricket team) టెస్టు ప్లేయర్స్ అజింక్యా రహానే (Rahane), చతేశ్వర్ పుజారా (Pujara) లు ప్రత్యర్థులుగా మారనున్నారు. గత కొంత కాలంగా పూర్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న వీరు టెస్టు టీమ్‌లో తమ స్థానాలను ప్రశ్నార్థకం చేసుకున్నారు. దాంతో మునుపటి ఫామ్‌ను అందుకునేలా ఫిబ్రవరి 17 నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji trophy) లో పాల్గొంటున్నారు. ఈ మేరకు మాజీ చాంపియన్స్ సౌరాష్ట్ర (Saurashtra) టీమ్‌లో పుజారా చోటు దక్కించుకోగా.... 41 సార్లు చాంపియన్ ముంబై (Mumbai) టీమ్‌లో రహానే స్థానం సంపాదించాడు. వీరు రంజీ ట్రోఫీలో ఆడితే ప్రత్యర్థులుగా ఎలా మారనున్నారని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా... ముంబై, సౌరాష్ట్ర జట్లు ఎలైట్ గ్రూప్ బిలో ఉన్నాయి. అంతేకాకుండా 17 నుంచి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దాంతో మొన్నటి వరకు దేశం కోసం సహచరులుగా ఆడిన వీరు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారనున్నారు.
టీమిండియా మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. తన కంటే చాలా జూనియర్ అయిన పృథ్వీ షా సారథ్యంలో ముంబై రంజీ జట్టుకు ఆడేందుకు రెడీ అయ్యాడు. సలీల్ అంకోలా నేతృత్వంలోని ముంబై సెలెక్షన్ కమిటీ ఈ విషయాన్ని దృవీకరించింది. రహానే చేరకతో ముంబై టీం మరింత బలంగా మారనుందని ముంబై కోచ్ అమోల్ ముజుందార్ పేర్కొన్నాడు.
అయితే, ఇటీవలి కాలంలో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రహానే రంజీల్లో ఆడి ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ బాస్ గంగూలీ కూడా ఇటీవల స్పష్టం చేశాడు. టీమిండియా తరఫున 82 టెస్ట్‌లు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానే జట్టు సాధించిన ఎన్నో మరపురాని విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.
టోర్నీ ఫార్మాట్
కరోనా వల్ల గతేడాది జరగాల్సిన రంజీ ట్రోఫీ రద్దయింది. ఈ ఏడాది ఈ టోర్నీ ఇప్పటికే ఆరంభం కావాల్సి ఉన్నా... ఒమిక్రాన్ వల్ల మరోసారి వాయిదా పడింది. తాజాగా ఒమిక్రాన్ కేసులు దేశంలో తగ్గు ముఖం పట్టడంతో రంజీ ట్రోఫీ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈసారి జరిగే రంజీ ట్రోఫీ రెండు దశల్లో జరగనుంది. ఫిబ్రవరి-మార్చి మధ్య తొలి దశ జరగనుంది.
ఐపీఎల్ ముగిశాక రెండో దశ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. మొత్తం 38 జట్లు ఉండగా వీటిని నాలుగు గ్రూప్‌లుగా విడదీశారు. ఎలైట్ గ్రూప్ ఎ,బిలలో తొమ్మదేసి జట్లు ఉండగా... ఎలైట్ గ్రూప్ సిలో 10... ప్లేట్ గ్రూప్‌లో మరో 10 జట్లు ఉన్నాయి. వీటి మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన మొత్తం 64 మ్యాచ్‌లు జరుగుతాయి.
అహ్మదాబాద్, చెన్నై, రాజ్‌కోట్, కటక్, తిరువనంతపురం, ఢిల్లీ, హరియాణా, గువాహటి, కోల్‌కతాలలో మ్యాచ్‌లు జరుపుతారు. కరోనా నేపథ్యంలో కఠిన క్వారంటైన్ నిబంధనలకు అమలు చేయనున్నారు. ప్రతి జట్టు కూడా ఐదు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా జట్టులో 20 మంది ఆటగాళ్ల వరకు ఉండొచ్చు. వీరికి 10 మంది సహాయక సిబ్బంది ఉంటారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.