AJINKYA RAHANE CHETESHWAR PUJARA ALONG WITH ISHANT SHARMA LIKELY GET DEMOTION AND KL RAHUL RISHABH PANT GETS PROMOTION IN BCCI CENTRAL CONTRACTS SRD
BCCI Central Contracts: సీనియర్లకు చెక్ పెట్టే యోచనలో బీసీసీఐ.. జూనియర్లకు ప్రమోషన్..!
Team India
BCCI Central Contracts: సౌతాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలమైన సీనియర్ క్రికెటర్లపై బీసీసీఐ గుస్సాగా ఉంది. దీంతో, వీరికి చెక్ పెట్టే విధంగా బీసీసీఐ (BCCI) ఎత్తుగడ వేసింది.
దక్షిణాఫ్రికా (South Africa)పర్యటనలో భారత్ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఆపై వన్డేల్లో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో టీమిండియా (Team India) ఫ్యాన్స్ పూర్తిగా నిరాశకు గురయ్యారు. ఈ పర్యటనలో దారుణంగా విఫలమైన సీనియర్లు క్రికెటర్లపై బీసీసీఐగుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, వీరికి చెక్ పెట్టే విధంగా బీసీసీఐ (BCCI) ఎత్తుగడ వేసింది. టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలకు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్న ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో డిమోషన్ అయ్యే అవకాశాలున్నాయి. గత కొంతకాలంగా పుజారా, రహానే పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న రహానే, పుజారాలను గ్రేడ్-బి కాంట్రాక్ట్‌కు డిమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమేశ్ యాదవ్, ఇషాంత్శర్మలకు డిమోషన్ తప్పేలా లేదు. వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్(అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022) సెప్టెంబర్‌లో ముగియనుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 కాంట్రాక్ట్‌లను బీసీసీఐ సిద్దం చేస్తోంది. 28 మంది ఆటగాళ్లతో ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా తయారు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించేందుకు ముగ్గురు ఆఫీస్ బేరర్స్‌తో పాటు.. ఐదుగురు సెలక్టర్లు... జాతీయస్థాయి కోచ్‌లతో కమిటీ సిద్ధమైంది. త్వరలోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను వెల్లడించనుంది.
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో వీరికి అవకాశం దక్కనుంది. ప్రస్తుత కాంట్రాక్టులో ఈ ఇద్దరు గ్రేడ్-ఏ కాంట్రాక్ట్‌లో ఉన్నారు. కొంతకాలంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోయారు.
తమకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ప్రమోషన్ లభించనుంది. ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఈ కాంట్రాక్ట్ దక్కుతుంది.
ఇక గతేడాదిగా బౌలర్‌గా మంచి ప్రదర్శన ఇస్తున్న మహ్మద్ సిరాజ్‌ను గ్రేడ్ సి నుంచి గ్రేడ్ బికి ప్రమోట్ చేసే అవకాశం ఉంది. టెస్టుల్లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్‌తో పాటు హనుమ విహారిలకు కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, మహమ్మద్ షమీలకు కూడా ప్రమోషన్ లభించనుంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే సెంట్రల్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ సిద్దం చేశామని, త్వరలోనే ఫైనలైజ్ చేస్తామని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.