• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • AIR SWIMMIMNG OR RUNNING ON A TREADMILL MUMBAI INDIANS PACER TRENT BOULT TROLLED BY NETIZENS GH SRD

Trent Boult: ఏంటి.. ట్రెంట్ బౌల్ట్ గాలిలో ఈత కొడుతున్నావా..? కివీస్ పేసర్ పై ఫన్నీ ట్రోలింగ్..

Trent Boult: ఏంటి.. ట్రెంట్ బౌల్ట్ గాలిలో ఈత కొడుతున్నావా..? కివీస్ పేసర్ పై ఫన్నీ ట్రోలింగ్..

Photo Credit : Twitter

Trent Boult: అతడు గాలిలో ఈత కొడుతున్నాడా?, ట్రెడ్ మిల్‌పై పరుగెత్తుతున్నాడా?, బౌల్ట్ దొర్లుతున్నాడు, బౌల్ట్ ఊగిసలాడుతున్నాడు, బౌల్ట్‌కు సంబంధించి ఇది గ్రేట్ ఫాల్.. అని చాలామంది ఈ వీడియోకు ట్యాగ్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఒక టీవీ షోలో జరిగిన సన్నివేశాన్ని ఒక యూజర్ బౌల్ట్ వీడియోతో పాటు షేర్ చేశాడు.

  • Share this:
ఐపీఎల్ విన్యాసాలు క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు మీమ్స్ క్రియేటర్లు, నెటిజన్లకు కూడా మంచి వినోదాన్ని పంచుతున్నాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బంతితో మంచి ప్రదర్శన చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో అతడు 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం అతడు విఫలమయ్యాడు. బంతి వెనుక పరుగెత్తుతూ బౌల్ట్ కిందపడిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బంతిని ఆపలేక కొత్త రకం విన్యాసాలు చేస్తున్నాడని నెటిజన్లు బౌల్ట్‌పై కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కొట్టిన బంతి బౌండరీ వైపు వెళ్తుండగా.. బౌల్ట్ బంతిని ఆపడానికి దాని వెనుకే పరుగెత్తాడు. కానీ కొంత దూరం పరుగెత్తిన తరువాత బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోయాడు. అతడు కింద పడిన వీడియో రీప్లేలను చూస్తూ కామెంటేటర్లు, అభిమానులు కూడా నవ్వుకున్నారు. అతడి సహచరుడు, న్యూజిలాండ్ ప్లేయర్ జేమ్స్ నీషమ్ కూడా ట్విట్టర్లో బౌల్ట్‌ను సరదాగా ఎగతాళి చేశాడు.

అతడు గాలిలో ఈత కొడుతున్నాడా?, ట్రెడ్ మిల్‌పై పరుగెత్తుతున్నాడా?, బౌల్ట్ దొర్లుతున్నాడు, బౌల్ట్ ఊగిసలాడుతున్నాడు, బౌల్ట్‌కు సంబంధించి ఇది గ్రేట్ ఫాల్.. అని చాలామంది ఈ వీడియోకు ట్యాగ్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఒక టీవీ షోలో జరిగిన సన్నివేశాన్ని ఒక యూజర్ బౌల్ట్ వీడియోతో పాటు షేర్ చేశాడు. గతంలో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన వివిధ రకాల ఫోటోలు, వీడియోలను బౌల్ట్‌కు అనుకరిస్తున్నారు. మీమ్స్, జోక్స్‌తో నెటిజన్లు బౌల్ట్ ఆడుకున్నారు.








ఈమధ్య మీమ్స్‌తో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ పోలీసులు కూడా ఈ వీడియోను అవగాహన కార్యక్రమాల కోసం ఉపయోగించారు. బంతిని ఆపే క్రమంలో బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక బౌల్ట్ కిందపడిన వీడియోను తెలంగాణ పోలీసులు అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీనికి ‘ఫీల్డింగ్ చేసేటప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు నియంత్రణ చాలా ముఖ్యం’ అని ట్యాగ్ పెట్టి షేర్ చేయడం విశేషం.
Published by:Sridhar Reddy
First published: