Home /News /sports /

AFTER VIRAT KOHLIS SHOCKING DECISION AS TO STEP DOWN AS TEAM INDIA SKIPPER WHO IS NEXT CAPTAIN SRD

Who Is Next Captain : టెస్టుల్లో విరాట్ కోహ్లీ వారసుడెవరు..? ఆ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ..!

Who Is Next Captain

Who Is Next Captain

Who Is Next Captain : కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత.. బీసీసీఐ అతడిని వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ.. తనకు తానే స్వయంగా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

ఇంకా చదవండి ...
    టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ ను షాక్ లోకి నెట్టాడు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ ను షాక్ లోకి నెట్టాడు. జట్టు విజయం కోసం తాను 120 శాతం ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా తనకు సహకరించిన ఆటగాళ్లు, కోచ్ రవిశాస్త్రి (Ravi Shastry)కి థ్యాంక్స్ చెప్పాడు. . కేవ‌లం కోహ్లీ అభిమానుల‌కే కాకుండా క్రికెట్ అభిమానులంద‌రికీ ఈ నిర్ణ‌యం మింగుడు ప‌డ‌డం లేదు. కాగా కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత.. బీసీసీఐ అతడిని వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే, రోహిత్ శర్మ (Rohit Sharma) కు లిమిటెట్ ఫార్మాట్ల బాధ్యతను అప్పగించింది బీసీసీఐ. అయితే, ప్రస్తుత ప్రశ్న ఏంటంటే.. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా నెక్ట్స్ టెస్ట్ కెప్టెన్ ఎవరు?

    వన్డే, టీ-20ల కెప్టెన్.. రోహిత్ శర్మ ఈ రేసులో ముందంజలో ఉన్నాడు. అయితే, రోహిత్ టెస్ట్ జట్టుకు కూడా కెప్టెన్ అవుతాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మీడియా కథనాల ప్రకారం ఇది జరగడం చాలా కష్టమని తెలుస్తోంది. విరాట్ కోహ్లి రాజీనామా తర్వాత ప్రస్తుతం కేఎల్ రాహుల్ తదుపరి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

    దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టు జట్టులో భారత జట్టుకు కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. విరాట్ కోహ్లి టెస్ట్‌కు ముందు వెన్ను గాయంతో దూరమైన సంగతీ తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అయితే కేప్ టౌన్ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.

    మరోవైపు రోహిత్ శర్మకు తన వయస్సే పెద్ద అడ్డంకిగా మారనుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయస్సు 34 ఏళ్లు. ఈ వయస్సులో ఉన్నవారు టెస్టు క్రికెట్ ఆడే కాల పరిమితి చాలా తక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. దీంతో, వయస్సు రీత్యా రోహిత్ శర్మను పక్కన పెట్టే ఛాన్సు ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రోహిత్ కు ఓ రెండేళ్లు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించి.. ఆ తర్వాత యంగ్ క్రికెటర్లకు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

    ఇది కూడా చదవండి : రిటైర్మెంట్ గురించి 24 గంట‌ల ముందు డ్రెసింగ్ రూంలో కోహ్లీ ఏం చెప్పాడు!

    మరోవైపు.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తో పాటు రిషబ్ పంత్ కూడా టెస్ట్ కెప్టెన్సీ రేసులోనే ఉన్నాడు. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహించిన అనుభవం రిషబ్ సొంతం. యంగ్ క్రికెటర్లు, సీనియర్లను కలుపుకుపోవడంలో దిట్ట. అదీగాక, వికెట్ కీపర్ బ్యాటర్ కు మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నది క్రీడా పండితుల అభిప్రాయం. దీంతో, రిషబ్ పంత్ వైపు కూడా బీసీసీఐ మొగ్గు చూపే ఛాన్సు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, రోహిత్, పంత్, కేఎల్ రాహుల్ మధ్య టెస్టు కెప్టెన్సీకి తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు