Rekulapally SaichandRekulapally Saichand
Updated: July 23, 2020, 6:40 PM IST
commentary
Iకరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ కఠిన నిబంధనాలను తీసుకోచ్చింది ఐసీసీ. బయో సెక్యూర్ విధానంలో టోర్నీస్ నిర్వహించాని నిర్ణయించింది. బంతిపై ఉమ్మి (సలైవా), ఆటగాళ్ళు హాగ్ చేసుకోవడం,చేతులు కలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. ద్వైపాక్షిక సిరీస్లను స్థానిక అంపైర్లతో నిర్వహించడం, డీఆర్ఎస్ రివ్యూలు కుదించడం లాంటి మార్పులు తీసుకొచ్చింది.
ఇప్పుడు మరో నింబంధనను అమలు చేయాలని వివిధ క్రికెట్ ఆలోచిస్తున్నాయి. తాజాగా సౌతాఫ్రికాలోని సెంచురీయన్ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్లో వర్చువల్ కామెంటరీ పద్దతిని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఇది సక్సెస్ కావడంతో దీన్ని ఐపీఎల్లోనూ అమలు చేయలాని ఆలోచిస్తున్నారు నిర్వహాకులు.
సెంచూరియన్ పార్క్లో జరిగిన ఈ లైవ్గేమ్కు ఇర్ఫాన్ పఠాన్,దీప్ దాస్గుప్తా, సంజయ్ మంజ్రేకర్ ఇంటి నుంచే కామెంటరీ లైవ్ కామెంటరీ అందించారు. ఇది ఏ క్రీడా ఇవెంట్లోనూ జరగలేదు. మెుదటిసారి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో అన్ని ఈవెంట్స్ అమలు చేయలాని భావిస్తున్నాయి వివిధ క్రీడా సంఘాలు. అయితే ఈ అనుభావాన్ని భారత మాజీ ఆల్రౌండర్ పఠాన్ ఈ వర్చువల్ కామెంటరీ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Published by:
Rekulapally Saichand
First published:
July 23, 2020, 6:39 PM IST