హోమ్ /వార్తలు /క్రీడలు /

T-20 World Cup : " ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది " .. భావోద్వేగానికి గురైన అశ్విన్..

T-20 World Cup : " ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది " .. భావోద్వేగానికి గురైన అశ్విన్..

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

T-20 World Cup : టీ- 20 ప్రపంచ కప్‌(T-20 World Cup) లో పాల్గొనే జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది

టీ- 20 ప్రపంచ కప్‌(T-20 World Cup) లో పాల్గొనే జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అందరూ ఊహించినట్టే ఐపీఎల్ స్టార్స్ సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది. ఆశ్చర్యకరంగా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌(Ravi Chandran Ashwin)కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. అయితే, నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశం దక్కడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా మోటివేషనల్ కోట్ షేర్ చేశాడు. 15 మంది సభ్యులతో భారత సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌కు అవకాశం లభించింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ 2017 జూలైలో భారత్‌ తరఫున వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్, అదే సిరీస్‌లో చివరిసారిగా వన్డే ఆడాడు.

నాలుగేళ్లుగా అశ్విన్ పూర్తిగా టెస్టులకు పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో అశ్విన్‌ నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టీ20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. 2020 ఐపీఎల్‌లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసి ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో అశ్విన్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. నిజానికి చెన్నైకే చెందిన వాషింగ్టన్‌ సుందర్‌ ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో అశ్విన్‌ కు అవకాశం దక్కింది.

దీనిపై అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలే తనేంటో నిర్వచిస్తాయని పేర్కొన్నాడు. నాలుగేళ్ల ఎదురు చూపులు ఫలిస్తూ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన తర్వాత అతడు ఇలా ట్వీట్‌ చేశాడు. " ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది. అయితే, వెలుతురు చూడగలమని నమ్మిన వాళ్లే దాన్ని చూసేందుకు బతికుంటారు " అని రాసిన చిత్రాన్ని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. " ఈ మాటలను గోడపై అంటించడానికి ముందే కొన్ని లక్షల సార్లు నా డైరీలో రాశాను! మనం చదివే మంచి మాటలను అన్వయించుకొని, జీవితంలో ఆచరిస్తే అవి మనకు మరింత ప్రేరణ, బలాన్ని ఇస్తాయి" అని చెప్పుకొచ్చాడు.

2017, జులై 9న యాష్‌ చివరిగా వెస్టిండీస్‌పై టీ20 ఆడాడు. అదే జట్టుపై జూన్‌ 30న చివరి వన్డే ఆడాడు. 111 వన్డేలాడిన అతడు 32.91 సగటుతో 150 వికెట్లు తీశాడు. 46 టీ20ల్లో 22.94 సగటు, 6.97 ఎకానమీతో 52 వికెట్లు పడగొట్టాడు. ఇక 79 టెస్టులాడి 24.56 సగటు, 2.80 ఎకానమీతో 413 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడటం, దుబాయ్‌ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో యాష్‌ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి : రోహిత్ శర్మ డౌటే..! మార్పులు ఖాయం.. ఆఖరి టెస్ట్ లో బరిలోకి దిగే తుది జట్టు ఇదే..!

ఇక, జడేజాకు బ్యాకప్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ జట్టులో స్థానం సంపాదించాడు. శ్రేయస్‌, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌ స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు. ఇక, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ధావన్, యంగ్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ జట్టులో చోటు దక్కించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. భారత జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు.

First published:

Tags: Cricket, India vs england, MS Dhoni, Ravichandran Ashwin, T20 World Cup 2021, Team India