ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ప్లే ఆఫ్స్ కథ తారా స్థాయికి చేరుకుంది. 10 జట్లతో ఆరంభమైన ఐపీఎల్ 2022 ఊహకందని ట్విస్ట్ లతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. తాజాగా ఆర్సీబీ (RCB) విక్టరీతో పంజాబ్ (Punjab Kings), హైదరాబాద్ (Sunrisers Hyderabad) అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించాయ్. దీంతో.. కోల్ కతా, ముంబై, చెన్నైల సరసన ఈ రెండు జట్లు కూడా చేరాయ్. తమ చివరి మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది ఆర్సీబీ. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్‌కు ఉన్న అడ్డంకి ఒకే ఒక జట్టు.. ఆ టీమే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఈ రిషభ్ పంత టీమ్.. ఇంకో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్- ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉంటుంది.
ముంబై మ్యాచులో ఢిల్లీ నెగ్గితే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో నాలుగో బెర్త్ ను దక్కించుకుంటోంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ నెట్ రన్ రేట్ ప్లస్ లో ఉంది. ముంబై మీద గెలిస్తే.. నెట్ రన్ రేట్ మరింత మెరగవ్వడం ఖాయం. ప్రస్తుతం ఢిల్లీ ఖాతాలో ఉన్న పాయింట్లు.. 14. ముంబై ఇండియన్స్‌పై ఓడిపోతే- అక్కడితోనే దాని ప్రస్థానం ఆగిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే మాత్రం- బెంగళూరుకు బెంగ ఉండదు. ప్రస్తుతం బెంగళూరు నెట్ రన్‌రేట్ -0.253 కాగా, ఢిల్లీది 0.255.
8 విజయాలు 16 పాయింట్లతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ జట్టు నెట్‌రన్‌రేట్ (-0.253) తక్కువగా ఉంది. దాంతో ఏడు విజయాలతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే మెరుగైన రన్‌రేట్ (0.255) ఉన్న కారణంగా ఆర్సీబీ వెనక్కినెట్టి ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ముంబై గెలిస్తే ఆర్సీబీకి ఛాన్స్ దక్కుతుంది. దీంతో.. ముంబై గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించి రోల్ మోడల్‌గా మారింది..జయహో జరీన్
ఇక, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్), మిల్లర్ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడుగా... డుప్లెసిస్ (38 బంతుల్లో5 ఫోర్లతో 44) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Delhi Capitals, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore