ఐపీఎల్ 2022 (IPL 2022)వ సీజన్ లీగ్ స్టేజీ హోరాహోరీగా సాగుతోంది. నెలన్నర రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ప్రతి జట్టు కూడా దాదాపు 12 మ్యాచ్ లు ఆడేశాయి. మరో 9 రోజుల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) , గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రూపంలో రెండు కొత్త జట్లు అడుగుపెట్టాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు దూసుకుపోతున్నాయ్. ఇప్పటికే 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ టికెట్ ను దక్కించుకుంది. 16 పాయింట్లతో లక్నోకు మెరుగైన ఛాన్సులు ఉన్నాయ్.లక్నో ఒక విజయాన్ని సొంతం చేసుకుంటే.. ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటోంది. అయితే, తాజాగా పంజాబ్ విజయంతో ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా మారింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు సజీవంగా నిలుపుకుంది. సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఇది 6వ విజయం కావడం విశేషం. తాజా విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీకి సీజన్ లో ఇది 6వ ఓటమి కావడం విశేషం. ప్రస్తుతం ఆజట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీంతో.. తమ ప్లే ఆఫ్ అవకాశాల్ని మరిత సంక్లిష్టం చేసుకుంది.
ఇక, సన్ రైజర్స్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఓటమి వల్ల సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకాస్త సంక్లిష్టం అయ్యాయి. IPL 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఓటములు పరంపర కొనసాగుతూనే ఉంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో ఆరంభమైన ఈ పరాజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్సీబీ ఓటమి తర్వాత సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ నెగటివ్ లోకి వెళ్లింది.
ఇది కూడా చదవండి : ఆర్సీబీ కొంపముంచిన నల్లపిల్లి.. దాన్ని చూసిన తర్వాతే దరిద్రం పట్టుకుంది..
సన్ రైజర్స్ ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్ల్లో ఓడింది. 5మ్యాచ్లు గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్లు సన్ రైజర్స్ ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్లు సన్ రైజర్స్కు కీలకం. ఇందులో తప్పకుండా 3 మ్యాచ్లు గెలిస్తేనే ప్లేఆఫ్ చేరడానికి సన్రైజర్స్ కు అవకాశముంటుంది. అలాగే ఒక్క మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపడి మిగతా జట్లతో క్లాష్ కాకుండా ఉంటుంది.
సన్ రైజర్స్ కు మిగిలి ఉన్న మూడు మ్యాచ్ల్లో ముంబై తప్పా కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మూడు జట్లు ప్లేఆఫ్ రేసు కోసం పోటీలో ఉన్నవే. కేకేఆర్ ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్.. 12 మ్యాచుల్లో 6 గెలిచి.. ప్రస్తుతం 12 పాయింట్లతో కొనసాగుతోంది.
పంజాబ్ కింగ్స్ కు ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయ్. లేటెస్ట్ గా ఆర్సీబీ భారీ విక్టరీతో ఆ జట్టు రన్ రేట్ పాజిటివ్ లోకి వెళ్లింది. దీంతో.. మిగతా రెండు మ్యాచుల్లో విజయం సాధించి.. అలాగే ఒక్క మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపడి మిగతా జట్లతో క్లాష్ కాకుండా ఉంటుంది. ఇక, ఒక్క మ్యాచ్లో ఓడినా ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయ్. ఆర్సీబీ , ఢిల్లీ, ఆర్ఆర్ జట్లు కూడా SRH కు పోటీ ఇస్తున్నాయ్. ఆర్ఆర్ కు ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయ్.
ఇందుల్లో ఒకటి గెలిచినా.. దాదాపు ప్లే ఆఫ్ రేసులో ముందుంటుంది. ఎందుకంటే వారి నెట్ రన్ రేట్ ప్లస్ లో ఉండటమే ఇందుకు కారణం. ఇక.. ఆర్సీబీకి ఒక మ్యాచు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో భారీ తేడాతో గెలిచి.. మిగిలిని ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది బెంగళూరు జట్టు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయ్. ఆ జట్టు కూడా ఈ రెండింటిలో తప్పక గెలవాల్సిన పరిస్థితి.
దీన్ని బట్టి కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ జయాపజయాలు సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరుకోవడానికి చాలా కీలకం. మరోవైపు, ముంబై ఇండియన్స్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత నాలుగింటిలో మూడు మ్యాచులు గెలిచి.. మిగతా జట్ల ప్లే అవకాశాల్ని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్ రేస్ కు చేరుకోవాలంటే మిగతా మూడు మ్యాచుల్లో కచ్చితంగా సన్ రైజర్స్ గెలవాల్సిందే. అందులో ఒక మ్యాచ్ భారీ తేడాతో గెలిస్తే.. అవకాశాలు ఇంకా మరింత మెరుగుపడతాయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Punjab kings, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad