Home /News /sports /

AFTER NEW ZEALAND NOW ENGLAND CALL OFF TOUR TO PAKISTAN 2022 TOUR OF PAKISTAN WILL CONTINUE AS PER SCHEDULE JNK

Pakistan Cricket: న్యూజీలాండ్ జట్టు పర్యటన రద్దైన షాక్ మరువక ముందే.. పాకిస్తాన్ క్రికెట్‌కు మరో షాక్

పాకిస్తాన్ పర్యటనను అర్దాంతరంగా రద్దు చేసిన ఈసీబీ (PC: ECB)

పాకిస్తాన్ పర్యటనను అర్దాంతరంగా రద్దు చేసిన ఈసీబీ (PC: ECB)

Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. న్యూజీలాండ్ జట్టు పర్యటన రద్దు చేసుకొని వెళ్లిన బాధలో ఉండగానే.. ఇంగ్లాండ్ జట్టు కూడా అక్టోబర్‌లో జరగాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    పాకిస్తాన్‌ క్రికెట్ (Pakistan Cricket) జట్టుకు మరో పెద్ద షాక్ తగిలింది. న్యూజీలాండ్ క్రికెట్ జట్టుతో (New Zealand Team) జరగాల్సిన సిరీస్ ప్రారంభానికి గంటల ముందు అర్దాంతరంగా పర్యటన రద్దు చేసుకొని వెళ్లిపోయిన విషయం తెలిసిందే. సిరీస్ అర్దాంతరంగా రద్దైన షాక్‌లో ఉన్న క్రికెటర్లు, ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరో పెద్ద షాక్ తగిలింది. అక్టోబర్‌లో జరగాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం ప్రకటించింది. పురుషుల, మహిళల జట్లు అక్టోబర్ నెలలో చెరి రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. కీలకమైన టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ముందు పురుషుల జట్టుకు వార్మప్ మ్యాచ్‌ల లాగ ఉపయోగపడుతుందని ఇంగ్లాండ్-పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు ఈ పర్యటనను ఏర్పాటు చేశాయి. కానీ ఇప్పడు అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.

    'చాలా కాలం క్రితమే పాకిస్తాన్‌లో ఇంగ్లాండ్ జట్టు 2022లో పర్యటించాలని నిర్ణయించాము. అంతే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో రెండు వార్మప్ మ్యాచ్‌ల నిర్వహణకు కూడా ఈసీబీతో పీసీబీ అంగీకారానికి వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ ముందు ఇరు జట్లకు వార్మప్‌లాగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నాము. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా కలసి డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఆడాలని భావించాము. ఈ విషయంపై మరోసారి చర్చించిన తర్వాత ఈసీబీ పర్యటన రద్దు చేయాలని నిర్ణయించింది. మా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మానసిక, శారీరిక ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు పాకిస్తాన్ వెళ్లి క్రికెట్ ఆడటానికి సిద్దంగా లేరు. పాకిస్తాన్‌లో పర్యటించడానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేనట్లు తెలుస్తున్నది. దీంతో పాటు కోవిడ్ కారణంగా ప్రయాణాలు చేయలేకపోతున్నారు. అందుకే ఈ పర్యటన రద్దుకే మేము మొగ్గు చూపాము' అని ఈసీబీ సదరు ప్రకటనలో పేర్కొన్నది.

    BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వారికి ఇకపై భారీగా జీతాలు.. పాత డిమాండ్లకు ఓకే


     






    కీలకమైన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముందు ఇలాంటి పర్యటన అంత ముఖ్యం కాదని ఈసీబీ భావించినట్లు తెలుస్తున్నది. ఫైవ్ ఐస్ గతంలోనే న్యూజీలాండ్ జట్టుపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. ఆ సమాచారం కారణంగానే న్యూజీలాండ్ తమ పర్యటన అర్దాంతరంగా రద్దు చేసుకున్నది. ఫైవ్ ఐస్‌లో భాగస్వామి అయిన యునైటెడ్ కింగ్‌డమ్ కూడా ఈసీబీకి పర్యటన రద్దు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తున్నది. వరల్డ్ కప్ ముందు ఆటగాళ్లు భయపడే అవకాశం ఇవ్వకూడదనే ఈసీబీ ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, 2022లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని పేర్కొన్నది. పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కదిద్దడానికి పీసీబీ కూడా చాలా కష్టపడుతున్న విషయం తెలిసిందే. న్యూజీలాండ్, ఇంగ్లాండ్ జట్ల పర్యటన ద్వారా ఒక పాజిటివ్ సంకేతం పంపాలని అనుకున్నా.. పరిస్థితి తిరిగి మొదటికే వచ్చింది. ఈ పర్యటన రద్దు కావడంతో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: England, Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు