Home /News /sports /

AFTER IPL 2022 SEASON CHENNAI SUPER KINGS SKIPPER MS DHONI STARTED DOING DUTY IN JHARKHAND PANCHYAT ELECTIONS HERE THE TRUTH BEHIND THIS SRD

MS Dhoni : జార్ఖండ్ పంచాయితీ ఎన్నికల విధుల్లో ధోని.. వైరల్ గా మారిన ఫోటో.. అసలు మ్యాటర్ ఇదే..!

Viral Photo

Viral Photo

MS Dhoni : ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని (MS Dhoni) తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేంద్రుడు.. జార్ఖండ్ పంచాయితీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అవునండీ.. మీరు విన్నది నిజమే.. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ (IPL) లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఈసారి కనీసం ప్లేఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడిన CSK కేవలం 4 మాత్రమే గెలిచింది. లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో CSK తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇక, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని (MS Dhoni) తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేంద్రుడు.. జార్ఖండ్ పంచాయితీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అవునండీ.. మీరు విన్నది నిజమే.. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆ విధులు నిర్వర్తిస్తోంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కాదు. ధోని లాంటి పోలీకలు ఉన్న వ్యక్తి. అతన్ని దగ్గర నుంచే చూస్తే ధోనిని చూసినట్టే ఉంది. ఇప్పుడు అతనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

    ఓ జాతీయ మీడియా ప్రకారం... ధోనిని పోలిన వ్యక్తి.. జార్ఖండ్ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో విధులు నిర్వరిస్తున్నారు. ఆ వ్యక్తి పేరు వివేక్ కుమార్. ఆయన సీసీఎల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్నారు. ఒకవైపు నుంచి చూస్తే మహేంద్ర సింగ్ ధోనీలానే కనిపిస్తున్నారు. దీంతో.. ధోని ధోని అంటూ అక్కడున్న వారంతా అతనితో పోటీ పడి మరీ సెల్ఫీలు తీసుకున్నారు.

    సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటో


    ఇక ఈ సీజన్ లో చెన్నై జర్నీ రోలర్ కోస్టర్ ను తలపించింది. సీజన్ ఆరంభానికి కొన్ని రోజుల ముందే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ప్రకటించడం.. కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజా ఎంపికవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సీజన్ లో అడుగుపెట్టిన చెన్నై జట్టుకు ఆరంభం నుంచే ఓటములు పలుకరించాయి. 8 మ్యాచ్ ల తర్వాత తాను కెప్టెన్ గా ఉండలేనంటూ జడేజా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో మరోసారి ధోనియే చెన్నై సారథిగా మారాడు.

    ఇది కూడా చదవండి :  డ్రెస్సింగ్ రూంలో బాలయ్య బాబు స్టైల్ లో కోహ్లీ సెలబ్రేషన్స్.. వైరలవుతున్న వీడియో..

    ఇక, వచ్చే సీజన్ లో కూడా ధోని ఆటగాడిగా ఆడే అవకాశం ఉంది. ' నేను అయితే కచ్చితంగా వచ్చే ఏడాది ఆడతానో లేదో చెప్పలేను. కానీ నా మనసులో ఉందేంటంటే.. సీఎస్కే తరఫున సీఎస్కే హోం గ్రౌండ్లో సీఎస్కే అభిమానుల ముందు ఆడాలని ఉంది. ఒకవేళ ఇదే లాస్ట్ ఐపీఎల్ అయితే సీఎస్కే అభిమానులకు అన్యాయం చేసినట్లే. అందుకే వచ్చే ఏడాది కూడా ఎల్లో జెర్సీలో కన్పించాలనుకుంటున్నా. అలాగే వచ్చే ఏడాది కేవలం ముంబై మాత్రమే కాకుండా అన్ని వేదికల్లో గేమ్స్ జరుగుతాయి. అలాంటప్పుడు వీడ్కోలు తీసుకోవడం బాగుంటుందేమో. ఏదేమైనా ఇప్పుడైతే నేను కచ్చితంగా చెప్పలేను' అని ధోనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో.. ధోని వచ్చే సీజన్ ఆడటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, IPL 2022, Jharkhand, MS Dhoni

    తదుపరి వార్తలు