Home /News /sports /

AFTER CRISTIANO RONALDOS ANTI FIZZY DRINKS STANCE PAUL POGBA IS THE LATEST FOOTBALLER REMOVES A HEINEKEN BEER BOTTLE AT EURO 2020 PRESS CONFERENCE VIDEO GOES VIRAL SRD

EURO 2020 : నిన్న రొనాల్డో... నేడు పాల్ పోబా....ప్రెస్ మీట్ లో బీర్ బాటిల్ పక్కన పడేశాడు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

EURO 2020 : యూరో ఫుట్ బాల్ టోర్నీలో బేవరేజస్ కంపెనీలకు స్టార్ ప్లేయర్స్ నుంచి తిప్పలు తప్పడం లేదు. నిన్న, పోర్చుగల్‌ జట్టు కెప్టెన్, జువెంటస్‌ క్లబ్‌ (ఇటలీ) స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో ఉదంతం మరవక ముందే..మరో స్టార్ ప్లేయర్ మరో బేవరేజస్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్ ను పక్కన పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకా చదవండి ...
    ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో... ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తాడన్న విషయం తెలిసిందే. జ్రిమ్‌తో పాటు డైట్‌ను కచ్చితంగా ఫాలో అవుతాడు. రొనాల్డో తన ఆహారంలో కేలరీస్‌ ఎక్కువగా లభించే జంక్‌ఫుడ్‌ లేకుండా జాగ్రత్త పడతాడు. తాజాగా ఒక మీడియా సమవేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్‌ను పక్కన పెట్టేసి.. ఇలాంటివి ఎంకరేజ్‌ చేయొద్దంటూ చెప్పడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ కంపెనీ 4 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయిందని సమాచారం. ఇప్పుడు మరో ప్లేయర్ కూడా క్రిస్టియానో రొనాల్డో బాట పట్టాడు. అతడే.. ఫ్రాన్స్ ఫుట్ బాల్ స్టార్ పాల్ పోబా. యూఈఎఫ్‌ఏ యూరోకప్‌ 2020లో భాగంగా జర్మనీపై విక్టరీ ఫ్రాన్స్. ఈ విజయంపై వివరణ ఇవ్వడానికి పాల్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై హీనెకెన్ కంపెనీకి సంబంధించిన బీర్ బాటిల్ కన్పించింది. దీంతో వెంటనే దాన్ని తీసి కింద పెట్టేశాడు పాల్. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

    పాల్ పోబా ఇలా చేయడానికి కారణం ఉంది. పాల్ పోబా ముస్లిం మతస్థుడు. ఇస్లాం లో బీర్ వంటి ఆల్క్ హాల్ పానీయాలు సేవించడం పాపంగా భావిస్తారు. ఈ కారణంతోనే పాల్ పోబా ఇలా చేశాడని అందరూ అనుకుంటున్నారు. అయితే, హీనెకెన్ యూరో కప్ కు స్పాన్సర్. మరి, మనోడు ఇలాంటి చేయడంతో ఆ కంపెనీకు కూడా కోకకోలా మాదిరిగానే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పాల్ కి ఫ్యాన్స్ ను మద్దతు లభిస్తోంది. ఓ ముస్లిం ప్లేయర్ ముందు బీర్ బాటిల్ పెట్టడం నిర్వహకులు చేసిన తప్పు అని..ఇందులో పాల్ తప్పు లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.


    రొనాల్డో దెబ్బకి ​కోకాకోలా స్టాక్‌ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకాకోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు (మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. రొనాల్డో వ్యవహరించిన తీరుపై యూరో ఛాంపియన్‌షిప్‌ స్పానర్‌షిప్‌గా వ్యవహరిస్తున్న కోకాకోలా స్పందించింది. ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు అని బదులిచ్చింది. ఇప్పుడు ఏ డ్రింక్‌ల పట్ల అయితే రొనాల్డో అయిష్టత కనబరిచాడో.. కొన్నేళ్ల క్రితం అదే సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీకి ఒక యాడ్‌ చేశాడు. 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకాకోలా బ్రాండ్‌కు యాడ్‌ చేశాడు. ఇప్పుడు పాల్ పోబా తీరుతో బీర్ కంపెనీకి కూడా భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cristiano Ronaldo, EURO 2020, Euro Cup 2021, Foot ball

    తదుపరి వార్తలు