ఒకే ఒక్క సీజన్ పర్ఫామెన్స్తో అందరి దృష్టినీ ఆకర్షించి, టీమిండియా (Team India)లో చోటు దక్కించుకున్నాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer). ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందరి నోట తన పేరే మారుమోగేలా చేస్తున్నాడు. 2021 ఐపీఎల్ సెకండాఫ్ లో దుమ్మురేపిన వెంకటేశ్ అయ్యర్.. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. ఫర్వాలేదన్పించాడు. అదే ఫామ్ ను ఇప్పుడు విజయ్ హాజారే ట్రోఫీ (Vijay Hazare Trphy)లో కూడా దుమ్మురేపుతున్నాడు. మధ్యప్రదేశ్ జట్టు తరుపున వెంకటేశ్ అయ్యర్ కూడా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లో రెండు సెంచరీలతో దుమ్ము రేపాడు అయ్యర్. ఛండీగర్ తో జరిగిన మ్యాచ్ లో తన పవర్ హిట్టింగ్ పవరెంటో బౌలర్లకు చూపాడు.
ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అయ్యర్ కేవలం 113 బంతుల్లో 151 పరుగులు చేసి దుమ్మురేపాడు. వెంకటేశ్ అయ్యర్ పవర్ హిట్టింగ్ తో మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 133.63. అతని ఇన్నింగ్స్ లో పది సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయంటే అర్దం చేసుకోవచ్చు.. వెంకటేశ్ అయ్యర్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో. ఇక, ఈ మ్యాచ్ లో సెంచరీ తర్వాత వెంకటేశ్ అయ్యర్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
రజనీకాంత్ స్టైల్ లో వెంకటేశ్ అయ్యర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రజనీ కళ్లజోడు స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఇదే స్టైల్ ని వెంకటేశ్ అయ్యర్ ఇమిటేట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తమ ట్విటర్ హ్యాండిల్ వేదికగా షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ భారీ సెంచరీతో నాలుగు మ్యాచుల్లో 348 పరుగులు చేశాడు వెంకటేశ్ అయ్యర్. అంతకుముందు కేరళతో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు అయ్యర్.
Our Sunday couldn't get any better! ?
Can you decode @ivenkyiyer2512's celebration? ?#VijayHazareTrophy #MPvUTCA #KKR #AmiKKR #CricketTwitterpic.twitter.com/7wpLMKEJ44
— KolkataKnightRiders (@KKRiders) December 12, 2021
చంఢీఘర్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మధ్యప్రదేశ్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, 88 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక, సౌతాఫ్రికా టూర్‌కి ఎంపిక చేసే జట్టులో వెంకటేశ్ అయ్యర్ పేరు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి : " యే బిడ్డా.. ఇది నా అడ్డా " .. పుష్పగా వార్నర్ అరాచకం.. కోహ్లీ పంచ్ వేసేశాడుగా..!
అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్‌కి కూడా మరోసారి సెలక్టర్ల నుంచి పిలుపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం ఇస్తే, హార్ధిక్ పాండ్యా తుదిజట్టుకి దూరం కావాల్సి ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తే ఓపెనర్‌గా ఎవరిని ఆడించాలనే విషయంపై పోటీ మరింత పెరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, IPL 2021, IPL 2022, Kolkata Knight Riders